బ్రేకింగ్: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తిరుపతి, నాగార్జున సాగర్ కు కూడా..

దేశంలో మరో అతిపెద్ద ఎన్నికల నగారా మోగింది. ఐదు పెద్ద రాష్ట్రాలతోపాటు 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో తెలంగాణలోని నాగార్జున సాగర్ తోపాటు, తిరుపతి ఎంపీ సీటుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఐదురాష్ట్రాల ఎన్నికలకు కేంద్రం సిద్ధమైంది. కేరళ, పశ్చిమ బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఈ సాయంత్రం 4.30గంటలకు మీడియా […]

Written By: NARESH, Updated On : February 26, 2021 6:16 pm
Follow us on

దేశంలో మరో అతిపెద్ద ఎన్నికల నగారా మోగింది. ఐదు పెద్ద రాష్ట్రాలతోపాటు 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో తెలంగాణలోని నాగార్జున సాగర్ తోపాటు, తిరుపతి ఎంపీ సీటుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల సందడి నెలకొంది.

ఐదురాష్ట్రాల ఎన్నికలకు కేంద్రం సిద్ధమైంది. కేరళ, పశ్చిమ బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఈ సాయంత్రం 4.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 27 నుంచి ఐదురాష్ట్రాల ఎన్నికు జరుగున్నాయి. అసోంలో మార్చి 27న తొలి దశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. కేరళలో ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. తమిళనాడులోనూ ఒకేవిడతలో ఏప్రిల్ 6న నిర్వహిస్తారు. పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6నే నిర్వహిస్తారు.

ఇక పశ్చిమ బెంగాల్ లో మాత్రం 8 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు నెలరోజుల పాటు 8 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు.

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశముంది.

పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచి మమతా బెనర్జీ సీఎం అయ్యారు. ఈసారి బీజేపీ పుంజుకొని మమతను ఓడించాలని పట్టుదలగా ఉంది.

ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వామపక్షాల ఫ్రంట్.. కాంగ్రెస్ పై గెలిచింది. ఈసారి కాంగ్రెస్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఇక్కడ బీజేపీ ప్రభావమే లేదు.

తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకే గతంలో గెలిచింది. ఈసారి ప్రతిపక్ష డీఎంకేకు చాన్స్ ఉంది.

అసోంలో గతంలో బీజేపీ గెలిచింది. ఈ ఎన్నికల్లోనూ దానికే ఎడ్జ్ ఉంది. గతంలో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది.

ఇక పాండిచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటీవల కుప్పకూలింది. బీజేపీ, తమిళ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నాయి.