
ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతంలో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, కశ్మీర్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భూమి కనిపించింది. రిక్టర్ స్కేలుపైదీని తీవ్రత ఏకంగా 6.1 గా నమోదైందని సిస్మాలజీ నిపుణులు వెల్లడించారు. రాత్రి 10.34 గంటల సమయంలో భూమి కంపించినట్టు చెబుతున్నారు.
ఇక భూకంపం కారణంగా ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు, షాండిలియర్లు ఊగాయి. జనం భయంతో ఆరుబయటకు పరుగులు తీశారు. సోషల్ మీడియాలో పలువురు భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.
పంజాబ్ లోని అమృత్ సర్ కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్ సర్ లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది.
కాగా భూకంప కేంద్రం తజకిస్తాన్ లో ఉన్నట్టు శాస్త్రవేత్తలుగుర్తించారు. తజికిస్తాన్ లో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. భూమికి 10 కి.మీల లోతులో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
ఇటీవలకాలంలో ఢిల్లీలో భూకంపం సర్వసాధారణమైంది. రోజుల వ్యవధిలో పలుమార్లు భూమి కంపించిన సందర్భాలున్నాయి. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే పంజాబ్ లోని బటిండాతోపాటు జమ్మూకశ్మీర్ లో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
An earthquake of magnitude 6.1 on the Richter scale hit Amritsar, Punjab at 10:34pm today: National Centre for Seismology #earthquake pic.twitter.com/ywI34bDv6s
— Anmol Singh Gulati (@AnmolSingh2110) February 12, 2021