https://oktelugu.com/

7236 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 7236 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అసిస్టెంట్ టీచర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://dsssb.delhi.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. https://dsssbonline.nic.in/ వెబ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 17, 2021 / 03:05 PM IST
    Follow us on

    ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 7236 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డీఎస్‌ఎస్‌ఎస్‌బీ ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అసిస్టెంట్ టీచర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://dsssb.delhi.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

    https://dsssbonline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జూన్ 24 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 7236 ఉద్యోగ ఖాళీలలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగ ఖాళీలు 6358 ఉండగా అసిస్టెంట్ ప్రైమరీ టీచర్ ఉద్యోగ ఖాళీలు 554, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ ఖాళీలు 278 ఉన్నాయి.

    అసిస్టెంట్ టీచర్ నర్సరీ, కౌన్సిలర్, హెడ్ క్లర్క్, పట్వారీ ఉద్యోగ ఖాళీలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్లు టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీటెట్ క్వాలిఫై కావడంతో పాటు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.

    ఇత కేటగిరీల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. వన్ టైర్ లేదా టూ టైర్ ఎగ్జామ్‌తో పాటు స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://dsssb.delhi.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.