
ప్రతి సంవత్సరం మనకు దీపావళి పండుగ ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ అమావాస్యకు ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశి రోజున సత్యభామ నరకాసురుని ఏవిధంగా చంపినది. ఈ పండుగను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా?
మన పురాణాల ప్రకారం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో పడేస్తాడు. అప్పుడు ఆ విష్ణుభగవానుడు వరాహావతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుని వధించి సముద్రగర్భం నుంచి భూదేవిని రక్షిస్తాడు. ఆ సమయంలో వారిద్దరికీ ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని చూసిన విష్ణుమూర్తి నిషిద్ధ కాలమైనా సంధ్యా సమయంలో కలవడం ద్వారా పుట్టిన ఈ బిడ్డకు రాక్షస లక్షణాలు వచ్చాయని భూదేవితో విష్ణుభగవానుడు చెబుతాడు.
ఆ విష్ణుభగవానుడు మాటలు విన్న భూదేవి బాధపడి ఎప్పటికైనా రాక్షస లక్షణాలు ఉన్న తన కుమారుని ఆ విష్ణుభగవానుడు వదిస్తాడని భావించిన భూదేవి సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడిని ఓ వరం అడుగుతుంది. తన బిడ్డకు రక్షణను ప్రసాదించమని విష్ణు మూర్తిని అడగగా, అందుకు అంగీకరించిన విష్ణు భగవానుడు తన కన్నతల్లి చేతులలోనే మరణం పొందుతాడని చెబుతాడు. దీంతో భూదేవి ఏ తల్లి తన బిడ్డలను చంపుకోదని భావించి సంతోషపడుతుంది.
Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?
జనకమహారాజు పర్యవేక్షణలో పెరిగిన నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని,ప్రాగ్జ్యొతిష్యపురము అనే రాజ్యాన్ని పాలిస్తుంటాడు. అక్కడ అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసి ఆ రాజ్యంలోని ప్రజలందరి నీఎంతో ఎంతో చక్కగా ఎటువంటి కష్టాలు లేకుండా పరిపాలించేవాడు.
తరువాతి ద్వాపరయుగంలో అతని పక్క రాజ్యమైన శోణితపురముకు రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడింది. బాణాసురుడుకి స్త్రీలు అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా, స్త్రీఅతని దృష్టిలో కేవలం ఒక భోగవస్తువుగా భావించేవాడు. అతనితో స్నేహం చేసిన నరకాసురుడు కొద్దిరోజులకు అమ్మ వారిని పూజించడం మానేసి, అన్ని రాజ్యాలపై దండెత్తి అక్కడ అందంగా ఉన్న అమ్మాయిలను బంధించే వాడు. ఈ నేపథ్యంలోనే ఒకసారి స్వర్గలోకం పై దండయాత్ర చేస్తాడు. కన్న తల్లి అయిన అదితి మాత, చెవి కుండలాలను తస్కరించి, దేవతలను అవమాన పరుస్తాడు.అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీకృష్ణ దగ్గరకు వెళ్లి నరకాసురుడి నుంచి తమను కాపాడాలని వేడుకుంటారు.
భూదేవి మాత ద్వాపరయుగంలో సత్యభామ అవతారంలో శ్రీకృష్ణుని వివాహం ఆడుతుంది. కానీ ఆమెకు పూర్వపు సంఘటన ఏమి గుర్తు ఉండక పోవడం వల్ల నరకాసురుడి తో యుద్ధానికి తను కూడా వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది. అందరూ కలిసి అశ్వ సైన్యంతో ప్రాగ్జ్యోతిష్యపురము వెళతారు.
Also Read: కార్తీక మాసమంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
అక్కడ నరకాసురుడికి శ్రీ కృష్ణుడికి మధ్యహోరాహోరీగా సాగుతున్నప్పటికి విష్ణుమూర్తి వరం వల్ల శ్రీకృష్ణుడు నరకాసురుని వధించ లేక మూర్చు వచ్చినట్లు నటించి పడిపోతాడు. తన కళ్ళముందే తన భర్త పడిపోవటంతో సత్యభామ వెంటనే విల్లు ధరించి నరకాసురుని వర్తిస్తుంది. ఈ విధంగా తన కన్నకొడుకును తానే చంపు కుంటుంది.నరకాసురుణ్ణి చతుర్దశి రోజున వధించడం వల్ల నరకచతుర్దశి గా దీపావళికి ముందు రోజు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.