https://oktelugu.com/

బండిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదా..?

బీజేపీ, జనసేన పొత్తు విషయంలో బండి సంజయ్ సూచనలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోలేదన్న టాక్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. బండి సంజయ్ జనసేనతో పొత్తులేదు.. ఏమీ లేదు పొమ్మన్నారు. అయినా బీజేపీ, జనసేనలు ఇపుడు ఎలా ఒకటయ్యాయి అంటే. తెరవెనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చక్రంతిప్పారట. బండి సంజయ్ ను కాదని మరీ కిషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను వెంట పెట్టుకుని పవన్ తో పొత్తు చర్చలు జరిపి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 08:08 PM IST
    Follow us on

    బీజేపీ, జనసేన పొత్తు విషయంలో బండి సంజయ్ సూచనలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోలేదన్న టాక్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. బండి సంజయ్ జనసేనతో పొత్తులేదు.. ఏమీ లేదు పొమ్మన్నారు. అయినా బీజేపీ, జనసేనలు ఇపుడు ఎలా ఒకటయ్యాయి అంటే. తెరవెనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చక్రంతిప్పారట. బండి సంజయ్ ను కాదని మరీ కిషన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను వెంట పెట్టుకుని పవన్ తో పొత్తు చర్చలు జరిపి ఫైనల్ చేసేశారట.

    పొత్తు కుదిరింది కానీ మొత్తం 150 డివిజన్లలోనూ బీజేపీనే పోటీ చేస్తోంది. జనసేన పోటీ నుండి విత్ డ్రా అయిపోయింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్.. బీజేపీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేస్తారు. బండి జనసేనతో పొత్తు ఎందుకు లేదన్నారంటే అప్పటికే అన్నీ డివిజన్లలో అభ్యర్ధులు ఖరారైపోయారు కాబట్టి. పొత్తుల్లో భాగంగా కొన్ని డివిజన్లలో మార్పులు చేస్తే గొడవైపోతుందని బండి అనుకున్నారు. అందుకనే జనసేనతో పొత్తు లేదని తేల్చేశారు. మరి తర్వాత ఏమైందో ఏమో మరుసటి రోజు కిషన్ అండ్ కో పవన్ తో పొత్తు కుదిర్చేసుకున్నారట.

    జనసేనతో పొత్తు చర్చల్లో బండి పాల్గొనలేదని. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకోవటం బండికి ఏమాత్రం ఇష్టంలేదట. అందుకనే జీహెచ్ఎంసి ఎన్నికల్లోనే కాదు తెలంగాణాలో ఏ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తుండదని బహిరంగంగానే ప్రకటించేశారు. కానీ పవన్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీ పెద్దలకు ఎందుకొచ్చిందన్నది ప్రశ్న. అందుకనే తన మాటకు కట్టుబడే బండి పొత్తు చర్చల్లో పాల్గొనలేదని సమాచారం. అంటే బండికి ఇష్టం లేకుండానే కిషన్ రెడ్డి.. జనసేనతో పొత్తు కుదుర్చుకున్న విషయం అర్ధమైపోతోంది.

    గ్రేటర్ పరిధిలో జనసేనకు ఉన్న బలమెంత ? అంటే ఏమో ఎవరికీ తెలీదు. ఎందుకంటే తెలంగాణలో కానీ.. గ్రేటర్ పరిధిలో కానీ జనసేన ఇంతవరకు యాక్టివ్ గా ఒక్క కార్యక్రమం కూడా జరిపిందే లేదు. కేసీయార్ తో వైరం ఇష్టంలేని పవన్ తెలంగాణా రాజకీయాలకు ఇంతకాలం దూరంగానే ఉంటున్నారు. అలాంటిది ఒక్కసారిగా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ అని ప్రకటిస్తే అందరు ఆశ్చర్యపోయారు. అసలు ఉందో లేదో కూడా తెలియని జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అంటే భలే విచిత్రంగా ఉందంటున్నారు జనాలు..