https://oktelugu.com/

షుగర్ పేషెంట్స్ ఆపిల్ తింటే ఏమవుతుందో తెలుసా..?

ఈ మధ్య కాలంలో దేశంలో చాప కింద నీరులా విజృంభిస్తున్న వ్యాధులలో షుగర్ ఒకటి. వేర్వేరు కారణాల వల్ల వచ్చే ఈ వ్యాధి బారిన పడితే దైనందిన జీవితంలో అనేక ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. షుగర్ బారిన పడ్డవారు ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే కళ్లు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే షుగర్ రోగులు ఆపిల్ తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 24, 2020 / 08:42 AM IST
    Follow us on


    ఈ మధ్య కాలంలో దేశంలో చాప కింద నీరులా విజృంభిస్తున్న వ్యాధులలో షుగర్ ఒకటి. వేర్వేరు కారణాల వల్ల వచ్చే ఈ వ్యాధి బారిన పడితే దైనందిన జీవితంలో అనేక ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. షుగర్ బారిన పడ్డవారు ఆహారపు అలవాట్లను మార్చుకోకపోతే కళ్లు, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే షుగర్ రోగులు ఆపిల్ తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది.

    షుగర్ తింటే తియ్యగా ఉంటుంది. వైద్యులు రోజుకు ఒక ఆపిల్ తింటే అన్ని రోగాలు నయమవుతాయని చెబుతూ ఉంటారు. మరి షుగర్ రోగులు ఆపిల్ తినవచ్చా..? అంటే వైద్యులు తినవచ్చని చెబుతున్నారు. ఆపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆపిల్స్ రుచితో పాటు పోషక విలువలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఆపిల్స్ లో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచుతుంది.

    గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఆపిల్ జ్యూస్ తాగితే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. షుగర్ బారిన పడని వారు రోజూ ఆపిల్ తింటే షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆపిల్ బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆపిల్స్ లో ఉండే మాలిక్ ఆసిడ్ జీర్ణక్రియ వేగంగా జరగడానికి సహాయపడుతుంది.

    డయేరియాతో బాధ పడే వారికి ఆపిల్ ఆ సమస్యను దూరం చేస్తుంది. ఆపిల్ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని అనవసర కొవ్వును తగ్గించడంలో ఆపిల్ సహాయపడుతుంది. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే యాపిల్స్ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.