Taliban: అమెరికా మరో దారుణం: తాలిబన్లకు లిఫ్ట్ ఇచ్చింది

Taliban: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా మారింది అమెరికా (America) పరిస్థితి. అధ్యక్షుడు బైడెన్ (Biden) చేసిన తప్పుకు అక్కడి పౌరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వదంతులు వినిపిస్తున్నాయి. అఫ్గాన్ లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తాలిబన్లు (Taliban) ఆ జాబితా ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని వారిని మట్టుబెట్టేందుకు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బైడెన్ ను ప్రశ్నించగా ఏమ జరిగి ఉండొచ్చని సమాధానం […]

Written By: Srinivas, Updated On : August 28, 2021 10:32 am
Follow us on

Taliban: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా మారింది అమెరికా (America) పరిస్థితి. అధ్యక్షుడు బైడెన్ (Biden) చేసిన తప్పుకు అక్కడి పౌరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వదంతులు వినిపిస్తున్నాయి. అఫ్గాన్ లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో తాలిబన్లు (Taliban) ఆ జాబితా ఆధారంగా వారి వివరాలు తెలుసుకుని వారిని మట్టుబెట్టేందుకు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బైడెన్ ను ప్రశ్నించగా ఏమ జరిగి ఉండొచ్చని సమాధానం చెప్పడంతో ఆయనపై అనుమానాలు పెరుగుతున్నాయి.

ఆగస్టు 15 న కాబుల్ ఆక్రమణ తరువాత అమెరికా అధికారులు తాలిబన్లకు ఒక జాబితా అందజేశారు. ఇందులో అమెరికా పౌరులు గ్రీన్ కార్డు ఉన్నవారు, అఫ్గాన్ లో మిత్రులు ఉన్నారని తెలుసుకున్నారు. వారిని విమానాశ్రయంలోకి అనుమతించాలని కోరారు. కానీ తాలిబన్లు ఎయిర్ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని వారిని రాకుండా చేస్తున్నారు. దీంతో అమెరికా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అమెరికాకు సాయం చేసిన వారిని గతంలో తాలిబన్లు చంపిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను గుడ్డిగా నమ్మి వారి చేతిలో జాబితా పెట్టడంతో అమెరికా వాసుల బాధలు వర్ణనాతీతం. కాబుల్ విమానాశ్రయంపై దాడి అనంతరం నిర్వహించిన సమావేశంలో బైడెన్ జాబితాను అప్పగించలేదని చెప్పలేకపోయారు. దీంతో ఆయన పై అందరిలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తాలిబన్లు అమెరికాకు సాయం చేసిన వారిని పట్టుకునేందుకు ఇంటింటికి తిరిగా సోదాలు చేస్తున్నారు. దీంతో అమెరికా పౌరుల జీవితాలు ప్రమాదంలో పడినట్లు అయింది. అమెరికా వీసా కోసం అప్లై చేసిన చాలామంది విమానాశ్రయానికి చేరుకున్నా తాలిబన్లు వారిని అనుమతించడం లేదు. దీంతో వారు అక్కడే అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే తాలిబన్లు జాబితాను క్లియర్ చేసేదాకా కొత్త వారిని తరలించేది లేదని చెబుతున్నారు.