https://oktelugu.com/

ఇస్లాం, క్రైస్తవం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లకు అనర్హులు: కేంద్రం సంచలనం

మరో తేనెతెట్టను కేంద్రం కలిపింది. మతం మారినా దళితుల పేరిట రిజర్వేషన్లు పొందుతున్న వారిపై కొరఢా ఝలిపించింది. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అలా లక్షల మంది ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు వారి భవిష్యత్ అంధకారంలో పడిపోతోంది. హిందుత్వం నుంచి ఇస్లాం, క్రైస్తవంలోకి మారినా దళిత రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం వారికి శరాఘాతంగా మారింది. ఇప్పటికే సీఏఏ చట్టం తెచ్చి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : February 13, 2021 / 09:25 AM IST
    Follow us on

    Loksabha

    మరో తేనెతెట్టను కేంద్రం కలిపింది. మతం మారినా దళితుల పేరిట రిజర్వేషన్లు పొందుతున్న వారిపై కొరఢా ఝలిపించింది. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అలా లక్షల మంది ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు వారి భవిష్యత్ అంధకారంలో పడిపోతోంది. హిందుత్వం నుంచి ఇస్లాం, క్రైస్తవంలోకి మారినా దళిత రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారు కోట్లలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రం నిర్ణయం వారికి శరాఘాతంగా మారింది.

    ఇప్పటికే సీఏఏ చట్టం తెచ్చి దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్రం ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేసి అంతకుమించిన వివాదాన్ని కొని తెచ్చుకుంది. తాజాగా పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటన దళితుల్లో అగ్గి రాజేసింది.

    దళితులు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు కోల్పోతారని పార్లమెంట్ సాక్షిగా కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగినప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

    ఎస్సీ, ఎస్టీల లిస్ట్ లోని చాలా మంది మతం మారినప్పటికీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీచేస్తున్నారు. పదవులు కూడా పొందుతున్నారు. అలాంటి వారిని అనర్హులుగా పరిగణించేందుకు రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉందా అని జీవీఎల్ ప్రశ్నించారు.

    దీనికి సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్ ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. అయితే నామినేషన్ వేస సమయంలో వారు మతం మారినట్లు పూర్తి సాక్ష్యాధారాలతో రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తే వారి నామినేషన్లను తిరస్కరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.