
మన దేశంలో చాలామంది ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉంటే సమీపంలోని మెడికల్ షాపుకు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్య సమస్య పెద్దదైతే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను మోసం చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఇంజెక్షన్ల, మందుల రేట్లను పెంచి కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను మోసం చేస్తున్నాయి.
Also Read: కొత్త కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..?
విజయవాడలో ఒక వ్యక్తి స్వల్ప పక్షవాతంతో ఆస్పత్రిలో చేరి మూడు రోజులు ఇంపేషెంట్ గా ఉన్నారు. మూడు రోజుల చికిత్స కోసం ఆస్పత్రి ఏకంగా 2,85,000 రూపాయల బిల్లు వసూలు చేస్తుండటం గమనార్హం. కార్పొరేట్ ఆస్పత్రులు బ్రాండెడ్ మందుల పేరుతో బయట 10 రూపాయలకు దొరికే ట్యాబ్లెట్ ను ఆస్పత్రిలో 100 రూపాయలకు అమ్ముతూ మోసం చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు చితికిపోయేలా కార్పొరేట్ ఆస్పత్రులు వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.
Also Read: బీటెక్ అర్హతతో 35 ఉద్యోగాలు.. రూ.1,40,000 వేతనంతో..?
బ్రాండెడ్ మందుల స్థానంలో జనరిక్ మందులు అందుబాటులో ఉన్నా వైద్యులు మాత్రం జనరిక్ మందులు రాయడం లేదు. కంపెనీల నుంచి తక్కువ ధరలకే బ్రాండెడ్ మందులను కొనుగోలు చేస్తున్న కంపెనీలు ఎంఆర్‌పీని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతూ ఉండ్తం గమనార్హం. ఏపీ మెడికల్ కౌన్సిల్ జనరిక్ మందులు రాయాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలు అమలు కావడం లేదు.
బ్రాండెడ్ మందుల వల్ల రోగులు, రోగుల కుటుంబాలు ఆర్థికంగా ఎక్కువ మొత్తం నష్టపోతున్నాయి. కేంద్రం మందుల ధర తగ్గే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొందరు వైద్యులు మాత్రం తక్కువ ధరకు మందులు విక్రయిస్తే ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతుందని.. ఎంఆర్‌పీ కంటే తగ్గించడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.