Also Read: ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ పై వివాదం..!
‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లోని కొన్ని సన్నివేశాలపై ఇప్పటికే వివాదం నెలకొంది. ఎన్టీఆర్ ను ముస్లింగా చూపించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా మరోవైపు ఈ టీజర్లోని కొన్ని సన్నివేశాలను జక్కన్న కాపీ కొట్టాడని ప్రచారం చేస్తున్నారు. ఫ్రూప్ లతో సహా నెట్టింట్లో పెడుతూ జక్కన్న క్రియేటివీటీని ప్రశ్నిస్తున్నారు.
ఈ టీజర్లో చూపించిన కొన్ని విజువల్స్ ఎక్కడి నుంచో కాపీ కొట్టారనేది కొన్ని గంటల్లోనే నెటిజన్లు బయటపెట్టారు. ఇటీవల ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ విషయంలోనూ ఇలానే జరిగింది. తాజాగా జక్కన్న ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ పై కూడా కాపీ మరకపడటంతో దర్శకులంతా కాపీ మాస్టర్లేనా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లో చూపించిన దట్టమైన అడవి.. మధ్యలో సూర్య బింబం విజువల్.. వర్షంలో నీటి బిందువులు.. అగ్నిపర్వతం విజువల్స్ అన్నీ రాజమౌళి చిత్రీకరించని కావని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ కు చెందిన ఓ వీడియో నుంచి అగ్నిపర్వతం విజువల్ తీసుకోగా.. ఇంకో రెండుచోట్ల నుంచి అడవి.. నీటి బిందువుల సీన్స్ తీసుకున్నారని అంటున్నారు.
Also Read: ‘ఆరెంజ్’ దెబ్బకు అన్నయ్య నాగబాబు ఆస్తులు అమ్ముకున్నాడు.. పవన్ భావోద్వేగం
ఎంతో ఆలస్యంగా వచ్చిన ఎన్టీఆర్ టీజర్ పై కాపీ మరకలు పడటాన్ని నందమూరి ఫ్యాన్స్ జీర్ణించుకోలేపోతున్నారు. అయితే కరోనా టైంలో లేటుగా షూటింగ్ ప్రారంభించిన రాజమౌళికి సరైన సమయం లేకపోవడంతో టీజర్ విషయంలో ఇలా కొన్ని విజువల్స్ జోడించి వదిలేశాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పని విషయంలో చాలా ఫర్ ఫెక్ట్ గా ఉండే రాజమౌళి ఇలా చేయడమెంటీ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై జక్కన్న కౌంటర్ ఇస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!