https://oktelugu.com/

బీజేపీకి కేటీఆర్‌‌ మార్క్‌ పంచ్‌

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంతో స్నేహంగానే ఉండాలని చూస్తుంటాయి. ఎందుకంటే.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కూడా అంతో ఇంతో చేయూతనందించాలి కాబట్టి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున పీఎంగా మోడీ కొనసాగుతున్నారు. ఆయన నిర్ణయాలు చాలా వరకు రాష్ట్రాల ప్రభుత్వాలకు నచ్చవు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో తలాడిస్తూనే ఉంటారు. Also Read: చెరువు కింద బిక్కు బిక్కు.. భయం భయంగా హైదరాబాదీలు కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 11:34 AM IST
    Follow us on

    రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంతో స్నేహంగానే ఉండాలని చూస్తుంటాయి. ఎందుకంటే.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కూడా అంతో ఇంతో చేయూతనందించాలి కాబట్టి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరఫున పీఎంగా మోడీ కొనసాగుతున్నారు. ఆయన నిర్ణయాలు చాలా వరకు రాష్ట్రాల ప్రభుత్వాలకు నచ్చవు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో తలాడిస్తూనే ఉంటారు.

    Also Read: చెరువు కింద బిక్కు బిక్కు.. భయం భయంగా హైదరాబాదీలు

    కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఆయన నిర్ణయాలపై కస్సుబుస్సు అంటూ ఉంటుంది. అంతేకానీ.. మోడీని విమర్శించేందుకు ఏ ఒక్కరూ సాహసించరు. అలాంటి పార్టీలు ఏవైనా ఉన్నాయంటే వేళ్ల మీద లెక్క వేసి చెప్పొచ్చు. కేంద్ర రాజకీయాలకు కేరాఫ్‌ అయిన ఢిల్లీలోనే అధికారం చేపట్టిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ అప్పట్లో బీజేపీ అంటే ఒంటి కాలిపై లేచేవారు. కానీ.. తర్వాత తర్వాత ఏమైందో కానీ.. అప్పటి వేడి ఇప్పుడు కనిపించడం లేదు.

    ఇక.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్యంమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మోడీ స‌ర్కార్‌పై విమ‌ర్శలు చేసేందుకు ముందుకొచ్చారు. ఇక మ‌మ‌తా బెన‌ర్జీ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. క‌నీసం మ‌మ‌తా లాంటి నేత‌లు కూడా లేక‌పోతే ఈ దేశంలో బీజేపీని ఎదురించ‌గ‌ల మ‌రే నాయ‌కులు క‌నిపించ‌రని అనిపిస్తుంటుంది. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ నేత చంద్రబాబునాయుడు కూడా ఆ తీరుగానే దూసుకెళ్లారు. కానీ.. ఓటమి పాలయ్యాక సైలెంట్‌ అయిపోయారు.

    అయితే.. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌‌ మోడీ ప్రభుత్వంపై వెరైటీ పంచ్‌ వేశారు. ట్విట్టర్‌‌ వేదికగా దానిని సంధించారు. ‘కేటీఆర్‌ గారూ ఇటీవల మీరు భారత్‌ బయోటెక్‌ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్‌’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’ అని ట్విట్టర్‌ వేదికగా ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు.

    Also Read: ‘ధరణి’ ఆన్ లైన్ నమోదుపై కేసీఆర్ కీలక ప్రకటన

    ఇందుకు కేటీఆర్‌‌ బదులిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్‌ టీకా వేసుకోలేదు. అది బీహార్‌ కోసమే రిజర్వ్‌ చేశారట’ అని బీజేపీకి సెటైర్‌‌ వేశారు. బీహార్‌‌ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో టీకా అంశాన్ని చేర్చారు. తాము అధికారంలోకి వస్తే బీహార్‌‌ ప్రజలకు ఉచితంగా కరోనా టీకా వేస్తామని ప్రకటించింది. దీనిని ఉద్దేశిస్తూ కేటీఆర్‌‌ ఇలా ట్వీట్‌ చేయడం ఆసక్తి రేపింది.