ఇంగ్లండ్ తో జరిగిన 4వ టీ20లో అంపైరింగ్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఈ టీ20లో చెలరేగి భారత్ విజయానికి బాటలు వేసిన బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ (57) వివాదాస్పద ఔట్ అగ్నికి ఆజ్యం పోసింది. థర్డ్ అంపైర్ అది నాటౌట్ అయినా కూడా ఔట్ ఇచ్చాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్రసెహ్వాగ్ మండిపడ్డారు. ప్రైజ్ మనీ ప్రజంటేషన్ లో కోహ్లీ సైతం అంపైర్ నిర్ణయాలు తనను షాక్ కు గురిచేశాయని అన్నారు.
టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా 13.2 ఓవర్ కు సూర్యకుమార్ షాట్ కొట్టగా ఆ బంతి నేలను తాకుతూ క్యాచ్ పట్టినట్టు స్పష్టంగా వీడియోలో కనిపించింది. అయినా దాన్ని ఔట్ గా ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
https://twitter.com/PradhanShashank/status/1372560509904457730?s=20
4వ టీ20లో థర్డ్ అంపైర్ నిర్ణయాల వల్ల భారత్ ఓడిపోతే సిరీస్ చేజారిపోయేది. కానీ లక్కీగా గెలవడంతో ఊపిరిపీల్చుకుంది. కానీ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ విధానాన్ని అందరూ తప్పు బడుతున్నారు.రిప్లేలో నేలను తాకుతున్నట్టు కనిపించినా కూడా అంపైర్లు ఇలా ఔట్ ఇవ్వడంపై టీమిండియాతోపాటు మాజీలు, నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎప్పుడూ సెటైర్లతో విరుచుకుపడే క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం అంపైర్లపై ఓ హాస్యాస్పద మీమ్ రూపొందించి వ్యంగ్యంగా విమర్శించాడు. అంపైర్ కళ్లు మూసుకొని ఔట్ ఇచ్చాడనేలా సెటైరికల్ ఫొటోను షేర్ చేశాడు. ఇక లక్ష్మణ్ అయితే ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా రిప్లే చూసి మరీ ఔటివ్వడం ఏమిటీ? ఈ నియమాన్ని పున: పరీశీలించాలి’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Third umpire while making that decision. #INDvENGt20 #suryakumar pic.twitter.com/JJp2NldcI8
— Virender Sehwag (@virendersehwag) March 18, 2021