https://oktelugu.com/

కాంగ్రెస్ నేతల పర్యటన ఉద్రిక్తం.. మంత్రిపై ఉత్తమ్ ఫైర్..!

వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని  కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31న జంగారెడ్డి స్వగ్రామమైన కాజీపేట టేకులగూడెం గ్రామంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జనవరి 1న కోర్టు ఎదుట హాజరుపర్చి సెంట్రల్ జైలుకు పంపించారు. Also Read: బీజేపీ ఆకర్ష్.. ‘కారు’ బేజారు..! ఈక్రమంలోనే జంగా రాఘవరెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన ర్యాలీ నేడు చేపట్టారు. ఈ ర్యాలీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 2, 2021 / 07:33 PM IST
    Follow us on

    వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని  కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31న జంగారెడ్డి స్వగ్రామమైన కాజీపేట టేకులగూడెం గ్రామంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జనవరి 1న కోర్టు ఎదుట హాజరుపర్చి సెంట్రల్ జైలుకు పంపించారు.

    Also Read: బీజేపీ ఆకర్ష్.. ‘కారు’ బేజారు..!

    ఈక్రమంలోనే జంగా రాఘవరెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసన ర్యాలీ నేడు చేపట్టారు. ఈ ర్యాలీలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రవంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్, ములుగు ఎమ్మల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.

    అయితే వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా వెళుతున్న నాయకులకు అడ్డంగా పోలీసులు తాడుతో కట్టి అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలకు.. పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

    Also Read: నడ్డాతో సోము, బండి.. ఏపీలోకి బండి సంజయ్ ఎంట్రీ.?

    ఈసందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జంగా రాఘవరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తుండటం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో ఎర్రబెల్లికి వ్యతిరేకంగా జంగా రాఘవరెడ్డి ప్రచారం చేశారనే కారణంతోనే టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారని ఆరోపించారు.

    ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జంగా రాఘవరెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నందునే టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్