https://oktelugu.com/

బ్రేకింగ్: గ్రేటర్ వార్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం.. ఉత్తమ్ రాజీనామా

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చాయి. బీజేపీకి కొండంత బలాన్నిచ్చాయి. అయితే ప్రతిపక్ష బీజేపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా చేశాయి. సింగిల్ డిజిట్ కే కాంగ్రెస్ పరిమితమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా బీజేపీకి పడిపోయింది. ఇక ఆ పార్టీని లేపడం ఎవరి తరం కాదని డిసైడ్ అయిన టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. Also Read: జీహెచ్ఎంసీలో హంగ్.. మేయర్ పీఠం ఎవరికి? […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2020 / 07:36 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చాయి. బీజేపీకి కొండంత బలాన్నిచ్చాయి. అయితే ప్రతిపక్ష బీజేపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా చేశాయి. సింగిల్ డిజిట్ కే కాంగ్రెస్ పరిమితమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా బీజేపీకి పడిపోయింది. ఇక ఆ పార్టీని లేపడం ఎవరి తరం కాదని డిసైడ్ అయిన టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీలో హంగ్.. మేయర్ పీఠం ఎవరికి?

    జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం పది స్థానాలైనా దక్కించుకుందని ఆశపడ్డ కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. కేవలం రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. మరోసారి కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమైంది.

    గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ కు వరుస ఓటములు ఎదురుకావడం…కాంగ్రెస్ నుంచి కొందరు కీలకమైన నేతలు బీజేపీలో చేరడం వంటి పరిణామాలతో పాటు తాజాగా కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో ఉత్తమ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను ఉత్తమ్ హైకమాండ్ కు పంపినట్టు తెలుస్తోంది. అయితే, ఉత్తమ్ రాజీనామాను హైకమాండ్ ఆమోదిస్తుందా…ఒకవేళ ఆమోదిస్తే కొత్త టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

    Also Read: టీఆర్ఎస్ వెంటే ఆంధ్రా ఓటర్లు..!

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు ఫలితాలలో అధికార టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. ఎంఐఎం ఎప్పటిలాగే తన స్థానాలను పదిలం చేసుకోగా…కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. టీఆర్ఎస్ దాదాపుగా 60 డివిజన్లలో గెలిచే అవకాశముండగా…బీజేపీ 45 డివిజన్లు గెలుచుకునే చాన్స్ ఉంది. ఎంఐఎం 40 డివిజన్లలో గెలిచే అవకాశాలుండగా…కాంగ్రెస్ పార్టీ 2 డివిజన్లతో సరిపెట్టుకుంది

    . పూర్తి ఫలితాలు వెలుడాల్సి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ…. 2019 ఎన్నికల్లో పరాజయం…ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం…తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం పాలవడంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్