https://oktelugu.com/

‘కలర్ ఫొటో’ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

చిన్న సినిమాగా తెరక్కెక్కిన ‘కలర్ ఫొటో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘కలర్ ఫొటో’ మూవీ ఫస్టు లుక్కు.. టీజర్.. సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టున్నాయి. నేటి సాయంత్రం 6గంటలకు ‘ఆహా’ ఓటీటీలో ‘కలర్ ఫొటో’ రిలీజ్ కానుంది. ఈమేరకు మీడియాకు స్పెషల్ షో చూపించారు. దీని ఆధారంగా సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం..! Also Read: పవన్-రానా కాంబో ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే? కమెడీయన్ సుహాన్ ‘కలర్ ఫొటో’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 04:50 PM IST
    Follow us on

    చిన్న సినిమాగా తెరక్కెక్కిన ‘కలర్ ఫొటో’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ‘కలర్ ఫొటో’ మూవీ ఫస్టు లుక్కు.. టీజర్.. సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టున్నాయి. నేటి సాయంత్రం 6గంటలకు ‘ఆహా’ ఓటీటీలో ‘కలర్ ఫొటో’ రిలీజ్ కానుంది. ఈమేరకు మీడియాకు స్పెషల్ షో చూపించారు. దీని ఆధారంగా సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం..!

    Also Read: పవన్-రానా కాంబో ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

    కమెడీయన్ సుహాన్ ‘కలర్ ఫొటో’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. సుహాన్ ‘పడి పడి లేచె మనసు’.. ‘మజిలీ’ సినిమాల్లో హీరో స్నేహితుడి పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ నటిస్తుండగా చాలా గ్యాప్ తర్వాత సునిల్ విలన్ పాత్రల్లో కన్పించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.

    లవ్.. ఎమోషన్.. కామెడీ ఎంటటైనర్ గా ‘కలర్ ఫొటో’ తెరకెక్కింది. సుహాన్ కామెడీ కంటే ఫెర్మామెన్స్ తో ఆకట్టుకున్నాడు. చాందిని నాచురల్ గా నటించింది. ప్రేమికులకు వ్యతిరేకం అయిన హీరోయిన్ అన్నయ్య క్యారెక్టర్ సునిల్ నటించి విలనిజాన్ని చూపించాడు. కామెడీ.. ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

    ఈ మూవీలోని కొన్నీ సీన్స్ చాలా బోరింగ్ అనిపించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొన్నిచోట్ల దొర్లాయి. ఇక సినిమా ప్రధానంగా ఉండాల్సిన లవ్ ట్రాక్ కొంత పట్టాలు తప్పినట్లు కన్పించింది. అయితే ఈ సినిమాకు బైరవ అందించిన సంగీతం ఆకట్టుకుంది. మెలోడీలు సాంగ్స్ మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి మార్క్ ట్విస్ట్.. అదేనట..!

    ‘కలర్ ఫొటో’లో నటించిన మిగతా నటీనటులు పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అయితే కొన్ని చోట్ల సినిమా సాగదీసినట్లు కన్పించింది. మొత్తానికి ‘కలర్ ఫొటో’లో కొన్ని మైనస్ లు.. కొన్ని ప్లస్ లతో ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకోనుంది. ఓటీటీల్లో ఇప్పవరకు రిలీజైన సినిమాల మాదిరిగానే ‘కలర్ ఫొటో’ కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.