https://oktelugu.com/

బిహార్ లో బీజేపీ ఫీట్లు.. ఫలిస్తాయా?

ప్రస్తుతం దేశం చూపంతా బిహార్ వైపే.. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు ఉండడంతో అందరి అటెన్షన్ అక్కడే ఉంది. ఇక జాతీయ పార్టీలు, లోకల్ పార్టీల హడావుడి అంతా ఇంతా కాదు.. అసలే బిహార్.. అక్కడి ఎలక్షన్లు అంటేనే కులాల పోరాటం.. కులమే ఆధారం.. పైసే ప్రధానం అన్నట్టు ఉంటుంది అక్కడి వ్యవహారమంతా.. లోకల్ పార్టీల ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తుంటాయి జాతీయ పార్టీలు.. అక్కడ జరిగే సిత్రాలు.. పార్టీలు, లీడర్ల ట్విస్టులు దేశ జనాలకు మంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 7:13 pm
    Follow us on

    BJP Vaccine politics

    ప్రస్తుతం దేశం చూపంతా బిహార్ వైపే.. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు ఉండడంతో అందరి అటెన్షన్ అక్కడే ఉంది. ఇక జాతీయ పార్టీలు, లోకల్ పార్టీల హడావుడి అంతా ఇంతా కాదు.. అసలే బిహార్.. అక్కడి ఎలక్షన్లు అంటేనే కులాల పోరాటం.. కులమే ఆధారం.. పైసే ప్రధానం అన్నట్టు ఉంటుంది అక్కడి వ్యవహారమంతా.. లోకల్ పార్టీల ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తుంటాయి జాతీయ పార్టీలు.. అక్కడ జరిగే సిత్రాలు.. పార్టీలు, లీడర్ల ట్విస్టులు దేశ జనాలకు మంచి ఎంటర్ టైన్ మెంట్.. ఎలక్షన్ ప్రచారం నుంచి మొదలు పెడితే.. కొత్త సీఎం పాలన షురూవయ్యే దాక ఎన్నోన్నో వింతలు.. విశేషాలు. అందుకే బిహార్ ఎన్నికలంటేనే దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది.

    Also Read: రైతుల కోసం మరో కొత్త పథకం.. లాంచ్ చేయనున్న మోదీ..?

    ఇక అసలు విషయానికొస్తే.. ఎన్నికల్లో గెలవడానికి పార్టీలు ఇచ్చే హామీలు, మ్యానిఫెస్టోలు ఎంతో ప్రభావం చూపుతాయి. అందుకే అన్ని పార్టీలు ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపించేందుకు నానా తంటాలు పడుతుంటాయి. అలాగే కామన్ మ్యానే ఇక కింగ్ అంటూ ఊరిస్తుంటాయి. బిహార్ ను మించిన తోపు ఏదీ లేదంటూ చెట్టెక్కిస్తుంటాయి. దేశమంటే బిహారే.. బిహారే దేశం అన్నంత రేంజ్ లో డబ్బా కొట్టేస్తుంటాయి. అలాంటి ఎన్నికల రణరంగంలో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా తక్కువేం తినలేదు.. వేలంపాటలు ముందుండి పాడుతుంటాయి.. అయితే ఈ దేశ పెద్ద పార్టీలు.. అక్కడి పార్టీల ముందు వెనుక బెంచీ పార్టీలే..

    దేశంలో ఫుల్ మెజార్టీతో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇక ఏ రాష్ట్రాన్ని వదిలే చాన్స్ లేదంటూ డిసైడ్ అయినట్టుంది. వారి పోకడ చూస్తుంటే. అవసరమనుకుంటే అధికారంలో ఉన్న పార్టీని సైతం గద్దె దించడానికి పాచికలు వేస్తోంది. అందులో కొన్ని ఎత్తులు చిత్తు కూడా అయ్యాయిలెండి. అయితే ఈసారి బిహార్ లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన కమలనాధులు.. బిహార్ ను బీజేపీ అడ్డా చేసుకోవడానికి ఈ ఎన్నికలను పునాది చేసుకోవాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనే నరేంద్ర మోడీ పాడిన ప్యాకేజీ వేలంపాటలు అక్కడి జనాలు వినలేదు. బిహార్ అభివృద్ధికి ఎన్నివేల కోట్ల రూపాయలు కావలంటూ.. ఓ ఎన్నికల సభలో మోడీ వేలంపాట పాడారు. అధికారాన్ని అప్పగిస్తే వేల కోట్ల ప్యాకేజీ దక్కుతుందంటూ ఊరించారు. అయితే బిహారీలు తక్కువోళ్లేం కాదుకదా.. లోకల్ పార్టీలు ఆర్జేడీ, జేడీయూ కూటమిని గెలిపించారు. తర్వాత బీజేపీ నానా ఎత్తులు వేసి నితీశ్ కుమార్ ను ఆకూటమి నుంచి బయటకు రప్పించింది. జేడీయూ మద్దతిచ్చి నితీశ్ నే సీఎం పీఠం ఎక్కించింది.

    Also Read: బీజేపీని బుట్టలో వేసేందుకు బాబు రాజకీయం

    అప్పుడే అలా అనుకుంటే.. ఈసారి ఇంకా చిత్రమైన హామీలు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.. కరోనాను కూడా రాజకీయ రణక్షేత్రంలోకి తెచ్చారు. తమకు అధికారం ఇస్తే.. కరోనా వ్యాక్సిన్ ను బిహార్ కు ఉచితంగా పంచుతారట. అలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఇంకా కొస ఏదో.. మొదలేదో తెలియడం లేదు. వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడో తెలియదు.. అసలు ఏ వ్యాక్సిన్ పనిచేస్తుందో తెలియదు. అయినా హామీలు మాత్రం కురిపిస్తున్నారు బీజేపీ లీడర్లు. మార్చి వరకు వ్యాక్సిన్ ముచ్చటే లేదని అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి!. ఇక ఇలాంటి చిత్రమైన బంపర్ ఆఫర్ల హామీల ను చూసి జనాలెమో ‘‘ఎందయ్యా.. ఇలాంటిది నెనెప్పుడూ వినలె..”అని విస్తుపోతున్నారు. అయితే బీజేపీ శ్రేణులకు ఈ హామీలు నచ్చి లైకుల మీద లైకులు, షేర్ల మీద షేర్లు చేస్తున్నా.. నాన్ బీజేపీ జనాలు మాత్రం డిస్ లైక్ అంటున్నారు.