భారత దేశంలో రామాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదమో.. అలాంటిది రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిరం నిర్మించడానికి కొన్నేళ్లుగా హిందువులు పోరాడాల్సి వచ్చింది.
Also Read: ‘ఏరువాక’ మాసపత్రిక ఆవిష్కరణ
ఎట్టకేలకు సుప్రీంకోర్టు అయోధ్య రామమందిరంపై చారిత్రాత్మక తీర్పునివ్వడంతో రామాలయం నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. రామాలయంతోపాటు.. ముస్లింల కోసం మసీదు నిర్మించేలా ధర్మాసనం తీర్పు నిచ్చింది.
ఈక్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రామాలయ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రామాలయం నిర్మాణం కోసం వీహెచ్‌పీ విరాళాలను సేకరించేందుకు సిద్ధమవుతోంది.
రామాలయం నిర్మాణం కోసం ఇప్పటికే శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తోంది.ఇక వీహెచ్‌పీ సైతం శ్రీరాముడి గుడి కోసం దేశవ్యాప్తంగా నిధులు సమీకరించనున్నట్టు ప్రకటించింది.
Also Read: రైతుల కోసం రాహుల్.. అనుహ్య నిర్ణయం..!
దేశంలోని నాలుగు లక్షల గ్రామాల నుంచి.. 11కోట్ల కుటుంబాల నుంచి నిధులు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలోని 9వేల గ్రామాల్లో 40లక్షల కుటుంబాల నుంచి నిధులు సేకరించనున్నారు.
వెయ్యిలోపు నిధులకు కూపన్లను.. రెండు వేలపైబడి ఇచ్చే నిధుల కోసం రశీదు ఇవ్వనున్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు వీహెచ్‌పీ నిధులను సమీకరించనుంది.
నిధుల సమీకరణ పారదర్శకంగా చేపట్టనున్నారు. వచ్చిన డబ్బులను అకౌంట్ లో డిపాజిట్ చేయనున్నట్టు వీహెచ్‌పీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్