
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని పండుగలను కేవలం ఎవరి కుటుంబంలో వారు మాత్రమే జరుపుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు సూచించాయి. అయితే మరి కొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగను ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున టపాకాయలను పేల్చి ఎంతో ఘనంగా నిర్వహించుకొనేవారు. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం కరోనా ఉన్న నేపథ్యంలో ఈ పండుగను కేవలం పూజలలో పాల్గొని జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పండుగకు బాణాసంచా కాల్చడాని ప్రభుత్వాలు అనుమతి లేదనే విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ రోజు ఫైర్ క్రాకర్స్ కి బదులుగా, “గ్రీన్ క్రాకర్స్” ను మాత్రమే ఉపయోగించాలని కర్ణాటక సీఎం బీఎస్ యెడియరప్ప ప్రజలను కోరారు.
దీపావళికి బాణసంచా లపై నిషేధం ప్రకటించిన తరువాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వెనక్కు తగ్గి, ఈ గ్రీన్ క్రాకర్స్ ను కాల్చడానికి అనుమతి తెలిపారు. ప్రజలు తమ పిల్లలను వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా ఈ పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆరోగ్యశాఖ సాంకేతిక సలహా కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం ప్రకటన చేసినట్లు సీఎం యడ్యూరప్ప తెలిపారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ,కరోనా జాగ్రత్తలను తీసుకొని ఈ పండుగను జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు. గ్రీన్ క్రాకర్స్ పర్యావరణ అనుకూలమైనవి. అంతే కాకుండా ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అభివృద్ధి చేయబడ్డాయి. ఈ గ్రీన్ క్రాకర్స్ లో హానికరమైన రసాయనాలను కలిపి ఉండరు కాబట్టి, ఇది వాతావరణాన్ని కాలుష్యం చేయవు కనుక,ప్రజలందరూ గ్రీన్ క్రాకర్స్ ని కాల్చి పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.