
బీహార్ లో ఇప్పటి వరకు ఆర్జేడీ లీడ్ లో ఉండగా ఆ తరువాత పరిస్థితి మారినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి ఆర్జేడీ లీడ్లో ఉండగా తాజాగా ఎన్డీయే స్థానాలు ముందజలోకి వెళ్లాయి. రెండు రౌండ్లు పూర్తయేయ్యసరికి ఈ పరిస్థతి ఎదురైంది. ఆర్జేడీ కూటమిలో 30 లోపు స్థానాల్లోనే కాంగ్రెస్ ఉంది. ఎన్డీయే కూటమిలో బీజేపీదే పై చేయి ఉంది. శత్రుఘ్నసిన్హా కుమారుడు ఓటమి బాటలో వెళ్తున్నారు. తాజాగా 1121 స్థానాల్లో ఎన్డీయే కూటమి లీడ్ లో ఉండగా, మరో 112 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యతో ఉంది. ఇక ఎల్ జేపీ 5, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు అయోమయంలో ఉన్నారు.