https://oktelugu.com/

‘హరిహర వీరమల్లు’ టీజర్ పై స్పందించిన చిరంజీవి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల ఆశలు తీరుస్తూ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ విడుదలకు రెడీ కాగా తాజాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పేరు, టీజర్ కూడా రెడీ అయ్యింది. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ పవన్ అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించింది. Also Read: కలెక్షన్లకు ‘శ్రీకారం’.. తొలిరోజు ఎంతంటే? ఇప్పటికే పింక్ రిమేక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2021 / 03:05 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల ఆశలు తీరుస్తూ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ విడుదలకు రెడీ కాగా తాజాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పేరు, టీజర్ కూడా రెడీ అయ్యింది. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ పవన్ అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించింది.

    Also Read: కలెక్షన్లకు ‘శ్రీకారం’.. తొలిరోజు ఎంతంటే?

    ఇప్పటికే పింక్ రిమేక్ వకీల్ సాబ్ ఈ మేలో రిలీజ్ కు రెడీ అయ్యింది. పింక్ మూవీ కథను తీసుకొని చాలా మార్పులు చేర్చులు చేసి ఈ మూవీని పవన్ ఫ్యాన్స్ కు, ఇక్కడి తెలుగుకు అనుగుణంగా మార్చేశారు. పవనిజం స్టామినా చాటేలా ఈ సినిమా ఉంటుందట.. పింక్ కు దీనికి చాలా మార్పులు చేశారట.. వకీల్ సాబ్ నుంచి విడుదలైన ‘సత్యమేయ జయతే ’ సాంగ్ కూడా జనంలో ఫుల్ రెస్పాన్స్ ఇచ్చింది.

    ఇక తాజాగా పవన్ కళ్యాన్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా పేరు, టీజర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఊరటనిచ్చేలా నిన్న ఫస్ట్ లుక్ టీజర్, పేరును అనౌన్స్ చేశారు మేకర్స్. అది అందరికీ షాక్ ఇచ్చింది.

    Also Read: బికినీలో అందాలు ఆరబోసిన సమంత..

    ఈ టీజర్ లో చారిత్రక వీరుడు, వజ్రాల దొంగ అయిన హరిహర వీరమల్లుగా ఒక కొత్త రూపు, కొత్త లుక్ తో పవన్ కళ్యాణ్ ను పరిచయం చేశాడు క్రిష్. ఈ టీజర్ లో చూపించిన పవన్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంతవరకు ఇలాంటి లుక్ లో పవన్ కనిపించలేదు. దీంతో ఈ చిత్రంపై అత్యధిక అంచనాలు నెలకొన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ టీజర్ ను చూసి అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాపై స్పందించారు. ‘పవన్ ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఇలాంటి డిఫెరెంట్ చిత్రంతో పవన్ ను తీసుకువస్తున్న క్రిష్ కు కృతజ్ఞతలు. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ ఎవరూ తీసుకోలేని కథను తీసుకున్నారు. హరిహర వీరమల్లుకు ఎంత చరిత్ర ఉందో.. ఈ చిత్రంలో మనం చూడవచ్చు అని’ చిరంజీవి ప్రశంసించారని సమాచారం. మొత్తానికి ఈ సినిమాలో పవన్ కొత్తగా కనిపించాడని చిరంజీవి చెప్పిన మాటలు ఈ టీజర్ కు మరింత హైప్ నిచ్చింది.