https://oktelugu.com/

ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా చేస్తే డబ్బు గోవిందా?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశంలో కోట్ల సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎస్బీఐ కస్టమర్లకు కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ సందేశాలు వస్తున్నాయి. అలాంటి మెసేజ్ లు వస్తే అప్రమత్తంగా ఉంటే మంచిది. మెసేజ్ లో లింక్ ను క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బు మాయమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కొంతమంది చైనా హ్యాకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఉచిత బహుమతులంటూ, కైవైసీ అప్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 9, 2021 / 07:24 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశంలో కోట్ల సంఖ్యలో కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎస్బీఐ కస్టమర్లకు కేవైసీ అప్ డేట్ చేసుకోవాలంటూ సందేశాలు వస్తున్నాయి. అలాంటి మెసేజ్ లు వస్తే అప్రమత్తంగా ఉంటే మంచిది. మెసేజ్ లో లింక్ ను క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బు మాయమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. కొంతమంది చైనా హ్యాకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

    ఉచిత బహుమతులంటూ, కైవైసీ అప్ డేట్ అంటూ సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతుండగా అప్రమత్తంగా ఉంటే ఈ మోసాల బారిన పడకుండా ఖాతాలోని డబ్బులను పోగొట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆటోబాట్ ఇన్ఫోసెక్, సైబర్ పీస్ ఫౌండేషన్ సంస్థలు సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తుండటం గమనార్హం.

    ఈ సంస్థలు చెబుతున్న సమాచారం ప్రకారం సైబర్ నేరగాళ్లు కేవైసీ వెరిఫికేషన్ పేరుతో ఒక లింక్ ను మెసేజ్ గా పంపుతున్నారు. ఆ లింక్ ను క్లిక్ చేస్తే అచ్చం ఎస్బీఐ వెబ్ సైట్ లా కనిపించే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను ఎంటర్ చేయమని ఉంటుంది. ఎస్బీఐతో పాటు పీ.ఎం.బీ, కోటక్ మహ్రీంద్రా బ్యాంక్ కస్టమర్లకు కూడా ఈ తరహా మెసేజ్ లు వస్తుండటం గమనార్హం.

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్లను కేవైసీ మెసేజ్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. సంస్థ ప్రతినిధి పేరుతో ఎవరైనా కాల్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ సూచనలు చేయడం గమనార్హం.