ప్రభుత్వ ప్రకటనలు అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చుపెట్టాయి. జగన్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల్లో ‘ఇది బాబు పథకం.. ఇది జగన్ పథకం అంటూ ప్రకటనలు ఇవ్వడంపై చంద్రబాబు శివాలెత్తిపోయాడు. ‘ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ ఇచ్చుకుంటాడు. ఆడి పేపర్ కి.. మళ్లీ ఇంకో పేపర్ కి.. ఏమనాలి వీణ్ణి.. ఇంగిత జ్ఞానం ఉందా?’ అంటూ సీఎం జగన్ పై చంద్రబాబు దారుణ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.
Also Read: ఏపీ అసెంబ్లీలో రచ్చ కంటిన్యూ..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వైసీపీ, టీడీపీ మధ్య రణరంగమే కొనసాగింది. సీఎం జగన్ మీద చంద్రబాబు నోరుపారేసుకున్నాడు. ఏకంగా జగన్, మంత్రులను పట్టుకొని ‘వాడు వీడు’ అంటూ చంద్రబాబు తిట్టదండకం అందుకోవడం చర్చనీయాంశమైంది.
పరిటాల రవి హత్య జరిగినప్పుడు కూడా వెళ్లలేదని.. రైతుల కోసం సీఎం జగన్ తీరు నచ్చక పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపానని చంద్రబాబు అన్నారు. నన్ను సస్పెండ్ చేస్తారా? ఎంతో మంది సీఎంలను చూశా.. నా జీవితంలో ఫస్ట్ టైం ఫేక్ సీఎం జగన్ ను చూస్తున్నా.. నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయసు అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
Also Read: బీజేపీపై జనసైన్యం ఫైర్.. ఓట్లు పడేనా..?
మా హయాంలో సాక్షిని కూడా నిషేధించలేదు. ఈయన అసెంబ్లీలో మూడు చానెళ్లను నిషేధించాడు. ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్ తో ఆడుకుంటారా అని చంద్రబాబు మండిపడ్డారు.
మమ్మల్ని అవమానిస్తారా? ఏం చేస్తారు? నన్ను చంపేస్తారా? మైక్ ఇవ్వరా? తనకు జరిగిన అవమానం కాదని.. ఇది రైతులకు జరిగిందని చంద్రబాబు నిప్పులు చెరిగాడు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్