https://oktelugu.com/

సీఎం జగన్ ను నరరూప రాక్షసుడు అనాలా..? రామతీర్థలో ఊగిపోయిన చంద్రబాబు

విజయనగరం జిల్లా రామతీర్థ పుణ్యక్షేత్రంలో దేవత విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు, విజయనగరం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు రామతీర్థను సందర్శించారు. చంద్రబాబు నడిచి కొండపైకి వెళ్లారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును చంద్రబాబు పరిశీలించారు. అక్కడి పూజారులు, స్థానికులను వివరాలు అడిగి […]

Written By: , Updated On : January 2, 2021 / 07:38 PM IST
Follow us on

Chandrababu Naidu

విజయనగరం జిల్లా రామతీర్థ పుణ్యక్షేత్రంలో దేవత విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన ఏపీలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు, విజయనగరం టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు రామతీర్థను సందర్శించారు. చంద్రబాబు నడిచి కొండపైకి వెళ్లారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడ రాముడి శిరస్సును ధ్వంసం చేసి పడేసిన కోనేరును చంద్రబాబు పరిశీలించారు. అక్కడి పూజారులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read: రామతీర్థ ఘటన: అశోక్ గజపతిరాజుకు షాకిచ్చిన జగన్

ఈ సందర్భంగా అక్కడ సమావేశంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడిని కాపాడే బాధ్యత సీఎం జగన్ కు లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ సీఎంని నరరూప రాక్షసుడు అనాలా? ఏమనాలి అని ప్రశ్నించారు. ఈ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి జగనే కారణమన్నారు.

‘నా హయాంలో మసీదు, చర్చిలపై దాడులు జరిగాయా? దేశమంతా జై శ్రీరామ్ నినాదం మర్మోగుతుంటే.. ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారు.. ఎన్టీఆర్ హయాంలో రామరాజ్యం చూశాం.. పోలీసులు తమాషాలు చేస్తున్నారా? అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారు.. ’ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Also Read: ఏపీలో మరో ఆరు నెలలు ‘స్పెషల్‌’ పాలన

వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరగడం అత్యంత దారుణమని బాబు ఆరోపించారు. హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

రామతీర్థంలో విజయసాయిరెడ్డికి ఏం పని అని.. ఇలాంటి చోటా మోటా నాయకులను తన రాజకీయ జీవితంలో చాలామందిని చూశానని చంద్రబాబు ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డిని అనుమతించి తనను అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్