https://oktelugu.com/

నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి..

నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి.. అదే హైదరాబాద్.. కానీ.. ప్రదేశాలు వేరు.. అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్ పై  దాడి చేయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు తన అనుకూల చానెల్ ఏబీఎన్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై కూడా అదే దాడి జరిగింది. అయితే నాడు చేసిన కుట్రనే నేడు జరిగిందని ఆరోపిస్తున్నాడు బాధితుడైన విష్ణు. ఎన్టీఆర్ పై, తనపై దాడి చేసింది టీడీపీ కుట్ర బ్యాచ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2021 7:24 pm
    Follow us on

    నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి.. అదే హైదరాబాద్.. కానీ.. ప్రదేశాలు వేరు.. అధికారం కోసం సొంత మామ ఎన్టీఆర్ పై  దాడి చేయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు తన అనుకూల చానెల్ ఏబీఎన్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై కూడా అదే దాడి జరిగింది. అయితే నాడు చేసిన కుట్రనే నేడు జరిగిందని ఆరోపిస్తున్నాడు బాధితుడైన విష్ణు. ఎన్టీఆర్ పై, తనపై దాడి చేసింది టీడీపీ కుట్ర బ్యాచ్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో తనపై జరిగిన  దాడి గురించి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తొలిసారి అధికారికంగా స్పందించాడు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు.

    విష్ణు వర్ధన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ ‘అధికారం కోసం నాడు వైశ్రాయ్ హోటల్ లో తెలుగు జాతి ముద్దుబడ్డ ఎన్టీఆర్ గారిపై టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పులు వేయించి
    దుశ్చర్యకాండ చేశాడు. అదే పరంపరలో నిన్న ఆయన అనుకూల చానెల్ ఏబీఎన్ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమంలో అదే పనిచేసిన మీ కుట్రకోణం కొనసాగుతూనే ఉన్నది. భౌతిక దాడులతో బీజేపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తామనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన’’ అని కడిగిపారేశాడు.

    ఇక వరుసగా మరో రెండు ట్వీట్లను కూడా విష్ణు చేశారు. ‘ప్రజల తరఫున ప్రశ్నించడంలో నేను వెనకడుగు వేసేదిలేదు, ఇటువంటి దాడులకు మేము బెదిరేది లేదు. అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతునొక్కడం అసాధ్యం. ప్రజా సమస్యలపై మరింత రెట్టింపుగా ఇకముందూ నా వాణి వినిపిస్తా..’ అంటూ చంద్రబాబు, దాని అనుకూల మీడియాపై విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

    ఇక చెప్పుపై దాడిని ఓవైపు ఖండిస్తూనే టీడీపీ, దాని అనుకూల బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ లో ఎండగట్టారు. ‘నా మీద, మా పార్టీ మీద మీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైనా మానుకుంటే మంచిది. నిన్నటి సంఘటనలో నాకు వెన్నంటి నిలచి, నాకు పూర్తి మద్దతుగా నిలబడిన నా పార్టీ కార్యకర్తలు,పార్టీ పెద్దలు,పలుపార్టీల నేతలు, జర్నలిస్ట్ సోదరులు,ప్రజా సంఘాలకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.’ అంటూ విష్ణు టీడపీ కుట్ర కోణాన్ని బయటపెట్టారు.

    మొత్తంగా విష్ణు వ్యాఖ్యలు చేస్తూ ఈయనపై  దాడి ఘటన ప్లాన్ ప్రకారమే జరిగిందా? టీడీపీ అనుకూల చానెల్ చేసిందా అన్న అనుమానాలను కూడా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే అనుమానాలు వ్యక్తం చేయడంతో దీనికి బలం చేకూరుతోంది.