రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు.. పునరాలోచనలో కేంద్రం..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశంలో వ్యవసాయ సంస్కరణ పేరుతో మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ బిల్లుల వల్ల రైతులకు మేలు చేకూరుతుందని కేంద్రం చెబుతుండగా.. రైతులు మాత్రం వీటి వల్ల తమకు నష్టం జరుగుతుందని వాదిస్తున్నారు. ఈక్రమంలోనే పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. Also Read: మరో బాంబ్ పేల్చడానికి రెడీ అయిన బీజేపీ గత 11రోజులుగా ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఉత్తరాది రైతులు చేపడుతున్న ఉద్యమానికి వివిధ రాష్ట్రాలలోని […]

Written By: Neelambaram, Updated On : December 7, 2020 11:24 am
Follow us on

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశంలో వ్యవసాయ సంస్కరణ పేరుతో మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ బిల్లుల వల్ల రైతులకు మేలు చేకూరుతుందని కేంద్రం చెబుతుండగా.. రైతులు మాత్రం వీటి వల్ల తమకు నష్టం జరుగుతుందని వాదిస్తున్నారు. ఈక్రమంలోనే పంజాబ్ రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చారు.

Also Read: మరో బాంబ్ పేల్చడానికి రెడీ అయిన బీజేపీ

గత 11రోజులుగా ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసనలు చేపడుతున్నారు. ఉత్తరాది రైతులు చేపడుతున్న ఉద్యమానికి వివిధ రాష్ట్రాలలోని రైతులు మద్దతు తెలుపుతుండటంతో అదికాస్తా దేశవ్యాప్త ఉద్యమంగా మారిపోయింది. ఈనేపథ్యంలోనే కేంద్రం రైతులతో పలుమార్లు చర్చించినా ఫలితం మాత్రం రావడం లేదు.

ఈక్రమంలోనే రైతుల సంఘాల నాయకులు ఈనెల 8న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ఇప్పటికే కాంగ్రెస్.. టీఆర్ఎస్.. ఆర్జేడీ, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌.. శివ‌సేన‌.. తృణ‌మూల్ కాంగ్రెస్.. డీఎంకే పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. అదేవిధంగా ప‌లువురు సినీ.. క్రీడా.. రాజకీయ ప్రముఖులు వ్యక్తిగతంగా మద్దతు ప్రకటిస్తున్నారు.

Also Read: ‘గ్రేటర్’ను ఏలనున్న మహిళామణులు.. వీరి సంఖ్య ఎంతంటే?

ప్రముఖ భారత బాక్సర్ విజేందర్ సింగ్ ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి తాజాగా మద్దతు ప్రకటించారు. నేడు ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్య‌తిరేక బిల్లులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తాను గ‌తంలో కేంద్రం నుంచి తీసుకున్న రాజీవ్ ఖేల్‌ర‌త్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానంటూ స్ప‌ష్టంచేశారు. ‌

పంజాబ్ లో మొదలైన రైతు ఉద్యమం క్రమంగా ఢిల్లీ.. హర్యానాతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతుండటంతో మోదీ సర్కార్ ఈ చట్టాలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా రేపు మరోసారి కేంద్రంతో రైతులు చర్చలు ఉన్న నేపథ్యంలో ఈసారైనా చర్చలు ఫలిస్తాయా? లేదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్