https://oktelugu.com/

మధుమేహ రోగులు శనగలు తినవచ్చా..? తినకూడదా..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మధుమేహ రోగుల ఆహారపు అలవాట్లకు సంబంధించి చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. డయాబెటిస్ రోగులు సైతం ఆ అపోహల వల్ల కొన్ని ఇష్టమైన ఆహారాలకు దూరమవుతూ ఉంటారు. మధుమేహ రోగులను శనగలు తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. Also Read: ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..? అయితే మధుమేహ రోగులు ఎలాంటి సందేహం అవసరం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2020 11:18 am
    Follow us on

    Chickpeas
    దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే మధుమేహ రోగుల ఆహారపు అలవాట్లకు సంబంధించి చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. డయాబెటిస్ రోగులు సైతం ఆ అపోహల వల్ల కొన్ని ఇష్టమైన ఆహారాలకు దూరమవుతూ ఉంటారు. మధుమేహ రోగులను శనగలు తినవచ్చా..? తినకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది.

    Also Read: ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

    అయితే మధుమేహ రోగులు ఎలాంటి సందేహం అవసరం లేకుండా శనగలు తినవచ్చు. మీరు ఒకవేళ శాఖాహారులైతే మరింత ఎక్కువగా శనగలను తీసుకోవడం మంచిది. శనగలలో ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో పాటు కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. శనగలు రోజూ తినడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సైతం తగ్గుతుంది.

    Also Read: సబ్జా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

    ప్రతిరోజూ శనగలను తీసుకోవడం ద్వారా సులభంగా బరువును అదుపులో ఉంచవచ్చు. ఇన్సులిన్ ప్రక్రియను మెరుచుపరచటంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి. ప్రతిరోజూ శనగలు తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి. శనగలు జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు కాలేయంలోని కొవ్వును సులభంగా కరిగిస్తాయి. నాడీవ్యవస్థ పనితీరును మెరుగుపరచటానికి, కండరాల వృద్ధికి శనగలు సహాయపడతాయి.

    మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

    గుండె, కాలేయం, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని శనగలు మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా కావడానికి కావాల్సిన క్యాల్షియం శనగల్లో పుష్కలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లాణాలు శనగల్లో పుష్కలంగా ఉంటాయి.