భారత్ లో, తెలుగు రాష్ట్రాలలో నివశించే ప్రజలు రేషన్ కార్డును కలిగి ఉంటే మాత్రమే సబ్సిడీ ధరలకే రేషన్ సరుకులను కొనుగోలు చేయడంతో ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటైన రేషన్ కార్డును కలిగి ఉంటే వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రస్తుతం ఉచితంగా రేషన్ అందిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరుగుతుండగా తెలంగాణలో రేషన్ డీలర్ల దగ్గరలకు వెళ్లి ప్రజలు రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ప్రజలకు రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రేషన్ ఏటీఎంల ద్వారా ప్రజలు సులభంగా రేషన్ సరుకులను పొందే అవకాశం అయితే ఉంటుంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో పైలెట్ ప్రాజెక్ట్ కింద రేషన్ ఏటీఎం ఏర్పాటు జరిగింది.
రేషన్ ఏటీఎం వల్ల తూకంలో మోసపోయే అవకాశం లేకపోవడం వల్ల రేషన్ సరుకులు పొందేవాళ్లకు ప్రయోజనం కలగనుంది. 5 నిమిషాల్లోనే 70 కేజీల వరకు రేషన్ పొందేలా ఈ రేషన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ సరుకులను సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రేషన్ సరుకులను పొందవచ్చు.
ఏ సమయంలో అయినా రేషన్ తీసుకునే అవకాశం ఉండటం ఈ రేషన్ ఏటీఎంలకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రేషన్ ఏటీఎంల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ జరగనుంది.