https://oktelugu.com/

వైరల్: తెలంగాణ మంత్రులు తిన్నది ఏంటి?

అది కేబినెట్ సమావేశం అనుకుంటా.. ఇద్దరు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమాలకర్ లు బయటకొచ్చారు. తలసాని ఏదో ఇచ్చాడు. దాన్ని గంగుల చేతిలో పోసుకున్నాడు.. అటూ ఇటూ నలిచి నోట్లో వేసుకున్నాడు. సాధారణంగా ఇలా నలిచి నోట్లో వేసుకునేది గుట్కా లేదా జర్దా. ఇలా కేబినెట్ మీటింగ్ గ్యాప్ లో మంత్రులు గుట్కా తిన్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో గుట్కా నిషేధించారు. అది వారికి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్న. అక్రమంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2021 / 09:04 PM IST
    Follow us on

    అది కేబినెట్ సమావేశం అనుకుంటా.. ఇద్దరు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, గంగుల కమాలకర్ లు బయటకొచ్చారు. తలసాని ఏదో ఇచ్చాడు. దాన్ని గంగుల చేతిలో పోసుకున్నాడు.. అటూ ఇటూ నలిచి నోట్లో వేసుకున్నాడు.

    సాధారణంగా ఇలా నలిచి నోట్లో వేసుకునేది గుట్కా లేదా జర్దా. ఇలా కేబినెట్ మీటింగ్ గ్యాప్ లో మంత్రులు గుట్కా తిన్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో గుట్కా నిషేధించారు. అది వారికి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్న. అక్రమంగా సరఫరా అవుతున్న గుట్కాను అధికార మంత్రులు వాడడమా? అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ ప్రశ్నించారు. మంత్రులిద్దరి   వీడియోను తాజాగా   దాసోజు శ్రావణ్ షేర్ చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని తెగ షేర్లు చేస్తూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. తెలంగాణ మంత్రులు గుట్కా తిన్నారని ట్రోల్ చేస్తున్నారు.

    ఇక ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మంత్రుల తీరుపై మండిపడ్డారు  ‘తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?
    బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’’ అని ప్రశ్నించారు.

    మొత్తంగా తెలంగాణ మంత్రులిద్దరూ ఇలా ఏదో పంచుకున్న వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అది గుట్కానా? లేక వక్కపొడినా? ఇంకా ఏదైనా అన్నది తేలాల్సి ఉంది.