వాహనదారులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.1,500 కడితే కొత్త బైక్..?

విద్యార్థులు, యువత బైక్ లేకపోతే పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బైక్ కొనాలనే ఆలోచన ఉన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉండటం వల్ల చాలామంది కొత్త బైక్ ను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే పండుగ సమయంలోని అదిరిపోయే ఆఫర్లు తక్కువ ఖర్చుతో బైక్ ను కొనుగోలు చేసేలా చేస్తాయి. అయితే తక్కువ మొత్తం ఈఎంఐతో బైక్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి. దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లలో […]

Written By: Navya, Updated On : November 1, 2020 11:05 am
Follow us on


విద్యార్థులు, యువత బైక్ లేకపోతే పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బైక్ కొనాలనే ఆలోచన ఉన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉండటం వల్ల చాలామంది కొత్త బైక్ ను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే పండుగ సమయంలోని అదిరిపోయే ఆఫర్లు తక్కువ ఖర్చుతో బైక్ ను కొనుగోలు చేసేలా చేస్తాయి. అయితే తక్కువ మొత్తం ఈఎంఐతో బైక్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి.

దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ లలో ఒకటైన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ను తక్కువ ఈఎంఐ మొత్తం చెల్లించి సులువుగా సొంతం చేసుకోవచ్చు. ఆన్‌రోడ్ మైలేజ్ కింగ్ అని పిలవబడే ఈ బైక్ వల్ల అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది. తరచూ ప్రయాణాలు చేసేవాళ్లకు ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో కంపెనీ వాహనదారులకు తక్కువ ఈఎంఐ, డౌన్ పేమెంట్ తో ఆన్‌రోడ్ ధరకు సమానమైన రుణాన్ని ఇస్తోంది.

కేవలం 11,111 రూపాయలు చెల్లించి 1,555 రూపాయల నెలవారీ ఈఎంఐతో బైక్ ను కొనుగోలు చేయవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు దగ్గరలోని షోరూంను సంప్రదించి ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నెలవారీ ఈఎంఐ తక్కువ మొత్తమే కావడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈ ఆఫర్ ను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే షోరూమ్ ను, బైక్ కొనుగోలు చేసే ప్రాంతాన్ని బట్టి ధరలో స్వల్పంగా మార్పులు ఉండవచ్చు.

బైక్ ఖరీదు విషయానికి వస్తే టీవీఎస్ సెల్ఫ్ స్టార్ట్ వెహికిల్ ధర 61,525 రూపాయలు కాగా కిక్ స్టార్ట్ వెర్షన్ ధర 54,850 రూపాయలుగా ఉంది. 110 సీసీ ఇంజిన్ తో పని చేసే ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫిటింగ్స్ , ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కోసం అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది.