https://oktelugu.com/

కుంబ్లేలా మారిన బుమ్రా.. ఇక లెగ్ స్పిన్ బౌలింగ్ నా?

టీమిండియా ఏస్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇక ఫాస్ట్ బౌలింగ్ చేయడా? అతడి యార్కర్లు మనకు కనిపించవా? అతడి బుల్లెట్ల లాంటి బంతులు ఇక పడవా? బీసీసీఐ వీడియో చూస్తే అదే డౌట్ అందరికీ వస్తుంది. ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రా తాజా ఆ ఫాస్ట్ బౌలింగ్ ను మరిచి లెస్ స్పిన్ నేర్చుకుంటున్నారు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేలా అనుకరిస్తూ నెట్స్ లో బంతులు విసురుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 31, 2021 / 07:50 PM IST
    Follow us on

    టీమిండియా ఏస్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇక ఫాస్ట్ బౌలింగ్ చేయడా? అతడి యార్కర్లు మనకు కనిపించవా? అతడి బుల్లెట్ల లాంటి బంతులు ఇక పడవా? బీసీసీఐ వీడియో చూస్తే అదే డౌట్ అందరికీ వస్తుంది.

    ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రా తాజా ఆ ఫాస్ట్ బౌలింగ్ ను మరిచి లెస్ స్పిన్ నేర్చుకుంటున్నారు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లేలా అనుకరిస్తూ నెట్స్ లో బంతులు విసురుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అది వైరల్ గా మారింది..

    ‘బుమ్రా యార్కర్లు, బౌన్సర్లు మనం చూశాం. అయితే ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు ప్రదర్శించని సరికొత్త వెర్షన్ లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. లెజెండ్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్ ను అనుకరిస్తున్నాడు’ అని బీసీసీఐ వీడియోకి వ్యాఖ్యను జత చేసింది.

    తనను అనుకరిస్తున్న బుమ్రా బౌలింగ్ యాక్షన్ పై అనిల్ కుంబ్లే కూడా స్పందించాడు. ‘వెల్ డన్ బుమ్రా.. నాలానే బౌలింగ్ చేస్తున్నావు.. నీ బౌలింగ్ యాక్షన్ అనుకరించడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది యువ బౌలర్లకు.. నువ్వు స్ఫూర్తి. ఇంగ్లండ్ సిరీస్ లో రాణించాలని కోరుకుంటున్నా’ అని కుంబ్లే వీడియోకి కామెంట్ చేశాడు.

    ప్రస్తుతం బుమ్రా సహా టీమిండియా క్రికెటర్లు అంతా చెన్నైలో బయో బబుల్ లో ఉంటూ ఇంగ్లండ్ తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.