స్కూళ్లు రీఓపెన్: విద్యార్థులు రేపటి నుంచి రెడీ కండి..

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విద్యార్థులు పొద్దున్న స్నానం చేసి.. ఆగమాగం టిఫిన్ చేసి.. భుజానికి బ్యాగులు వేసుకొని పోయి ఎన్ని రోజులైంది. ఎట్టకేలకు ఆ తరుణం రాబోతోంది. అయితే అందరికీ కాదు.. కేవలం 9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు మాత్రమే.. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్నారు. తెలంగాణలో విద్యాసంస్థలు రేపటి నుంచి పున:ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సంవత్సరకాలంగా ఇంట్లో ఉంటున్న విద్యార్థులు బోర్ కొట్టి స్కూళ్లకు వెళ్లడానికి తహతహలాడుతున్నారు. వారు మాస్క్ […]

Written By: NARESH, Updated On : January 31, 2021 8:18 pm
Follow us on

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. విద్యార్థులు పొద్దున్న స్నానం చేసి.. ఆగమాగం టిఫిన్ చేసి.. భుజానికి బ్యాగులు వేసుకొని పోయి ఎన్ని రోజులైంది. ఎట్టకేలకు ఆ తరుణం రాబోతోంది. అయితే అందరికీ కాదు.. కేవలం 9వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు మాత్రమే.. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తున్నారు.

తెలంగాణలో విద్యాసంస్థలు రేపటి నుంచి పున:ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సంవత్సరకాలంగా ఇంట్లో ఉంటున్న విద్యార్థులు బోర్ కొట్టి స్కూళ్లకు వెళ్లడానికి తహతహలాడుతున్నారు. వారు మాస్క్ లు, శానిటైజర్లు జేబులో వేసుకొని మరీ స్కూల్ కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు మాత్రం పిల్లలను బడికి పంపడానికి జంకుతున్నారు.

రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతుండడంతో విద్యార్థుల హాజరుపై కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నిర్వహించనున్నారు. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంది. ఇక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

కరోనా లాక్ డౌన్ ఆగిపోయిన చదువులు పట్టాలెక్కబోతున్నాయి. అయితే 1వ తరగతి నుంచి మాత్రం ఈ సంవత్సరం లేనట్టే కనిపిస్తోంది. స్కూల్, కాలేజీలకు వెళ్లడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతారా? కరోనా భయానికి వెనకడుగు వేస్తారా? అన్నది వారి ఇష్టంపై ఆధారపడి ఉంది.