https://oktelugu.com/

Mahabubnagar District: దారుణం.. భర్తను చంపి మరుగుదొడ్డి కింద పూడ్చి..

మహబూబ్ నగర్ జిల్లా నవబ్ పేట్ మండలం మొరం బాయి గ్రామంలో లో దారుణం చోటుచేసుకుంది. భూమి అమ్మిన డబ్బులు కోసం భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్ లో పోస్టు పెట్టిన భార్య.. మొరంబాయి గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తి దాదాపుగా రెండు నెలల నుండి కనబడడం లేదని చెన్నయ్య సోదరీమణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు వెంటనే స్పందించి మొరం బాయి గ్రామానికి వచ్చి చెన్నయ్య వివరాలు సేకరించగా భార్యపై అనుమానం వచ్చి […]

Written By: , Updated On : September 2, 2021 / 05:26 PM IST
Follow us on

మహబూబ్ నగర్ జిల్లా నవబ్ పేట్ మండలం మొరం బాయి గ్రామంలో లో దారుణం చోటుచేసుకుంది. భూమి అమ్మిన డబ్బులు కోసం భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్ లో పోస్టు పెట్టిన భార్య.. మొరంబాయి గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తి దాదాపుగా రెండు నెలల నుండి కనబడడం లేదని చెన్నయ్య సోదరీమణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు వెంటనే స్పందించి మొరం బాయి గ్రామానికి వచ్చి చెన్నయ్య వివరాలు సేకరించగా భార్యపై అనుమానం వచ్చి పోలీసులు భార్య రాములమ్మను తనదైన శైలిలో నిలదీయగా తానే 2 నెలల క్రితం భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్ లో పెట్టానని పోలీసులకు చెప్పింది.. వివరాల్లోకి వెళ్ళగా రెండు ఎకరాల భూమి మృతునికి ఉండగా ఒక ఎకరా భూమి అమ్మగా వచ్చిన పది లక్షల రూపాయల లో తోడబుట్టిన సోదరీమణులకు తులం బంగారం ఇవ్వగా మిగిలిన డబ్బు తో ఇంటి నిర్మాణం చేపట్టాడు ఇట్టి విషయంలో భార్య రాములమ్మ భర్తతో గొడవపడి భర్తను హతమార్చింది.. రాములమ్మ కు సహకరించిన చెల్లెలి భర్త మేస్త్రి కావడంతో రాత్రికి రాత్రే సెప్టిక్ ట్యాంక్ లో భర్త అనగా చెన్నయ్య మృతదేహాన్ని పూడ్చి పెట్టారు ఈరోజు నవపేట్ పోలీస్ అధికారులు చెన్నయ్య మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ నుండి వెలికితీశారు.