https://oktelugu.com/

టీజర్ టాక్: నందు-రష్మి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’యేనా?

నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘బ్లాక్ బస్టర్’ మూవీ టీజర్ రిలీజైంది. ‘విజయీభవ’ అంటూ ప్రారంభమైన టీజర్ చివరివరకు ఆకట్టుకుంది. 2.06నిమిషాల నిడివితో ఉన్న ‘బ్లాక్ బస్టర్’ టీజర్ ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్టు లుక్ మంచి ఆదరణ పొందగా తాజాగా విడుదల టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. Also Read: థియేటర్లు రెడీ.. సినిమాలు వచ్చేనా?..లైన్లో ఏమున్నాయి? సింగర్ గీతామాధురి భర్త నందు విజయకృష్ణ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 / 02:44 PM IST
    Follow us on

    నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘బ్లాక్ బస్టర్’ మూవీ టీజర్ రిలీజైంది. ‘విజయీభవ’ అంటూ ప్రారంభమైన టీజర్ చివరివరకు ఆకట్టుకుంది. 2.06నిమిషాల నిడివితో ఉన్న ‘బ్లాక్ బస్టర్’ టీజర్ ను హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్టు లుక్ మంచి ఆదరణ పొందగా తాజాగా విడుదల టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

    Also Read: థియేటర్లు రెడీ.. సినిమాలు వచ్చేనా?..లైన్లో ఏమున్నాయి?

    సింగర్ గీతామాధురి భర్త నందు విజయకృష్ణ టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించాడు. సహాయ నటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నందు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బ్లాక్ బస్టర్’ మూవీలో నందు హీరోగా నటిస్తుండగా యాంకర్ రష్మి హీరోయిన్ నటిస్తోంది. రష్మి బుల్లితెర అభిమానులను అలరిస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

    నందు-రష్మీ జంటకు ‘బ్లాక్ బస్టర్’ మూవీ హిట్టిచ్చేలా కన్పిస్తోంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఈ సినిమాలో నందు ‘పోతురాజు’గా నటిస్తున్నాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి వీరాభిమానిగా కన్పించబోతున్నాడు. హీరో శ్రీవిష్ణు వాయిస్ ఓవర్లో పోతురాజు క్యారెక్టర్ ను టీజర్లో పరిచయం చేశారు.

    ‘ఈ మొనగాడు పేరు పోతురాజు.. ఇతగాడికి పూరీ జగన్నాథ్ అంటే ఇష్టమనడంలో సందేహమే లేదు.. పోకిరి సినిమా చూసిన తర్వాత అది పిచ్చిగా మారిందనడంలో అస్సలు సందేహమే లేదు..’ అంటూ హీరో పాత్రని చూపించారు.

    Also Read: చెన్నైతో రైనా.. భజ్జీ బంధానికి తెరపడనుందా?

    పోతురాజు తన రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా రాసి.. తన ఫేవరైట్ డైరెక్టర్ అయిన పూరీకి ఇవ్వాలని.. బ్రతికినా చచ్చినా జీవితాంతం పూరీ డైరెక్షన్ లో బ్రతికుండాలని అనుకుంటాడని టీజర్లో చూపించారు. రష్మి నటన పర్వాలేదనిపించింది. వీరిద్దరికీ కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేలా కన్పిస్తోంది.

    విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల.. బోసుబాబు నిడుమోలు.. ఆనంద్ రెడ్డి.. మనోహర్ రెడ్డి కలిసి ఈ మూవీని నిర్మించారు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    టీజర్