https://oktelugu.com/

లోన్ తీసుకుంటున్నారా… తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే రెండు బ్యాంకులివే..?

మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో బ్యాంకులు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరే విధంగా చేస్తున్నాయి. ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును భారీగా తగ్గించి రుణాలు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏకంగా 15 బేసిక్ పాయింట్ల మేర కోత విధించడం వల్ల రుణాలకు వడ్డీ రేట్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2020 / 05:36 PM IST
    Follow us on


    మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో బ్యాంకులు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరే విధంగా చేస్తున్నాయి. ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును భారీగా తగ్గించి రుణాలు తీసుకున్న వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేసింది.

    బ్యాంక్ ఆఫ్ బరోడా ఏకంగా 15 బేసిక్ పాయింట్ల మేర కోత విధించడం వల్ల రుణాలకు వడ్డీ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ సమయంలో బ్యాంకు తీసుకున్న నిర్ణయం ద్వారా రుణాలు తీసుకున్న ఖాతాదారులందరికీ మేలు జరగనుంది. నేటి నుంచే తగ్గించిన వడ్డీ రేట్లు అమలులోకి రానుండగా రెపో లింక్డ్ లెండింగ్ రేటు 7 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గడం గమనార్హం.

    రెపో లింక్డ్ లెండింగ్ రేటు‌తో అనుసంధానం చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, కార్ లోన్, మోర్ట్ గేజ్ లోన్, హోమ్ లోన్ లను అందిస్తోంది. పండుగ సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా అడుగులు వేయడం గమనార్హం. బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

    ఈరోజు నుంచి 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ లోన్ తీసుకున్న వారికి 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత విధిస్తోంది. మహిళా ఖాతాదారులకు అదనంగా 5 బేసిక్ పాయింట్ల మేర కోత విధించింది. 700కు పైగా క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 7 శాతం వడ్డీరేటుకే రుణాలు ఇస్తోంది.