మోడీకి కంచుకోటనే: గుజరాత్ ‘స్థానిక’ ఎన్నికల్లోనూ బీజేపీ హవా

మోడీ మూడు నాలుగు సార్లు సీఎం పీఠం మెక్కి.. తద్వారా ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి ‘గుజరాత్’ రాష్ట్రమే కారణం. అలాంటి గుజరాత్ లో మోడీ తర్వాత కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. వరుసగా గెలుస్తూ వస్తోంది. మధ్యలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. ఆ సమయంలో సీఎంను మార్పు చేసిన బీజేపీ తగిన ఫలితాలను రాబట్టింది. ఇటీవలే జరిగిన గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రధాని మోడీయే కాదు.. దేశంలోనే నంబర్ […]

Written By: NARESH, Updated On : March 2, 2021 10:24 pm
Follow us on

మోడీ మూడు నాలుగు సార్లు సీఎం పీఠం మెక్కి.. తద్వారా ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి ‘గుజరాత్’ రాష్ట్రమే కారణం. అలాంటి గుజరాత్ లో మోడీ తర్వాత కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. వరుసగా గెలుస్తూ వస్తోంది. మధ్యలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. ఆ సమయంలో సీఎంను మార్పు చేసిన బీజేపీ తగిన ఫలితాలను రాబట్టింది.

ఇటీవలే జరిగిన గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రధాని మోడీయే కాదు.. దేశంలోనే నంబర్ 2 అయిన అమిత్ షా స్వరాష్ట్రం కూడా గుజరాత్ కావడం గమనార్హం. అయితే వీరిద్దరూ కూడా సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకున్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ భారీ విజయం సాధించారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లకు ఎన్నికలు జరుగ్గా.. బీజేపీ ఏకంగా 466 డివిజన్లలో విజయం సాధించి సత్తా చాటింది. ప్రతిపక్షం కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 45 స్థానాలకే పరిమితమైంది.

ఇక తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ హవా నడిచింది.జిల్లా పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలుకా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భారీ విజయం అందించారు.

తాజాగా జరిగిన స్థానిక సంస్థల్లో మొత్తం 31 జిల్లా పంచాయతీలు ఉండగా.. అన్ని స్థానాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే స్థానిక సంస్థల్లోనూ బీజేపీ విజయం సాధించింది.

గుజరాత్ లోని 31 జిల్లా పంచాయతీల్లో 980 స్తానాలు ఉండగా.. 742 స్థానాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ కేవలం 137 చోట్లకే పరిమితమైపోయింది. 231 తాలూకా పంచాయతీల్లో 4774 స్థానాలకు గాను బీజేపీ 2720 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 994 స్థానాల్లో గెలుపొందింది.

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలు గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘోర పరాజయంపై గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్ దా తన పదవికి రాజీనామా చేశారు.