https://oktelugu.com/

వామన్ రావు దంపతుల హత్యపై స్పందించిన కేటీఆర్

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్ రావు దంపతుల హత్య బాధ కలిగించిందన్న మంత్రి.. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామన్నారు. హత్య కేసులో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీ నుంచి తప్పించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వామన్ రావు దంపతుల మర్డర్ కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2021 / 10:39 PM IST
    Follow us on

    తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్ రావు దంపతుల హత్య బాధ కలిగించిందన్న మంత్రి.. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామన్నారు.

    హత్య కేసులో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీ నుంచి తప్పించామని కేటీఆర్ తెలిపారు.

    తెలంగాణలో వామన్ రావు దంపతుల మర్డర్ కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

    తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పట్టపగలు.. నడిరోడ్డుపై వందలాది మంది చూస్తుండగా హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కలకలం రేపింది. ఈ హత్య కేసులో పోలీసులు తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యల వెనుక ప్రధానంగా కీలకమైన టీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టు సమాచారం.

    ప్రధానంగా హైకోర్టు లాయర్ వామన్ రావు చనిపోతూ తనను టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్ చంపాడని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కుంట శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

    కుంట శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఉన్నాడు. కొంతకాలంగా కుంట శ్రీనివాస్ తో హైకోర్టు న్యాయవాది వామన్ రావుకు విభేదాలు ఉన్నాయి. వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో ఇద్దరి మధ్య భూవివాదం ఉన్నట్టు తెలిసింది. అదే హత్యకు దారితీసింది.