తెలంగాణలో బీజేపీ ప్రయోగించే బ్రహ్మస్త్రం.. ఇదేనా?

తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు మొదలుకాగా.. బీజేపీకి మాత్రం అనుకూల పవనాలు వీస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు స్పీడుకు బీజేపీ బ్రేకువేయడంతోపాటు కాషాయ జెండాను రెపరెపలాడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం కూడా ఆ పార్టీకి బాగా కలిసొస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా పావులు కదుపుతున్న బీజేపీ ఇప్పటికే అన్ని జిల్లాల్లో […]

Written By: Neelambaram, Updated On : December 25, 2020 3:26 pm
Follow us on

తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు మొదలుకాగా.. బీజేపీకి మాత్రం అనుకూల పవనాలు వీస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు స్పీడుకు బీజేపీ బ్రేకువేయడంతోపాటు కాషాయ జెండాను రెపరెపలాడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం కూడా ఆ పార్టీకి బాగా కలిసొస్తుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా పావులు కదుపుతున్న బీజేపీ ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ షూరు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకోగా మరికొందరు చేరేందుకు రెడీగా ఉన్నారు.

ఈక్రమంలో బీజేపీ తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీజేపీలను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డునే బ్రహ్మస్త్రంగా ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.

బీజేపీలో సీఎం క్యాండెట్ బీసీ అభ్యర్థేనని ఇప్పటికే లీకులు ఇస్తున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. తెలంగాణ బీసీ నేతలను బీజేపీలోకి లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది.

దీనిలో భాగంగా బీసీల్లో బలమైన మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు సైతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.

బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తునే వెనుకబడిన వర్గాలకు చెందిన ఎంపీలు సోయం బాపురావు.. ధర్మపురి అరవింద్‌లకు ప్రాధాన్యం కల్పిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు పోటీచేసే అవకాశాన్ని బీజేపీ కల్పించి అందరి దృష్టిని ఆకర్షించింది.

తెలంగాణలో టీఆర్ఎస్.. కాంగ్రెస్‌కు వెలమలు.. రెడ్ల బలముందని.. బీసీలను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉన్న బీసీ ఎమ్మెల్సేలు.. ఎంపీలు.. మాజీ మంత్రులకు బీజేపీ గాలం వేస్తోంది.

టీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు కరీంనగర్ చెందిన ఇద్దరు బలమైన బీసీ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ చెందిన బీసీ నేతలే టార్గెట్ గా బీజేపీ ఆకర్ష్ త్వరలో మొదలుకానుందని సమాచారం.