గ్రేటర్ మహాసంగ్రామం మొదలైంది. ఈ మహాసంగ్రామంలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో తెలియకుండా ఉంది. అయితే.. ఇప్పటివరకు మాత్రం ఏ పార్టీ అయినా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. వేరే పార్టీలతో పొత్తులేకుండానే పోటీ చేస్తామని చెబుతున్నారు. నిన్న మీట్‌ది ప్రెస్‌లో తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: వైసీపీ సైలెంట్‌గా ఎందుకు సైడ్ అయినట్లు..?
తాను పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నానని ప్రకటించారు. ఆ వెంటనే.. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ లేఖ దర్శనం ఇచ్చింది. పొత్తు చర్చల కోసం బండి సంజయ్ వస్తున్నారని.. రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని.. ఆ ప్రకటన సారాంశం. దీన్ని చూసి అందరూ నిజమే అనుకున్నారు. కానీ వెంటనే బండి సంజయ్ పవన్ కల్యాణ్ గాలి తీసేశారు. పవన్ కల్యాణ్‌తో తనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి కానీ.. పొత్తుల కోసం ఆయనను కలవడం లేదని తేల్చేశారు.
ఏపీలో బీజేపీ, జనసేనలు మిత్రపక్షంలా కొనసాగుతున్నాయి. అయితే.. అదే బంధం తెలంగాణలోనూ కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. అసలు జనసేనతో పొత్తు అంశం బీజేపీలో చర్చకు రాలేదని.. అలాగే పొత్తులపై జనసేన నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కుండబద్దలు కొట్టారు సంజయ్. గ్రేటర్‌లో ఒంటరిగా పోటీ చేయటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని.. అభ్యర్థులను కూడా ఎంపిక చేశామని, బీఫామ్‌లు కూడా రెడీ చేశామని జనసేనకు తలుపులు మూసేశారు. తను పవన్ కల్యాణ్‌కు.. పవన్‌కల్యాణ్‌కు తాను చాలా దగ్గర అని.. ఇద్దరి మధ్య మధ్యవర్తులు అవసరం లేదని, ఏ విషయం ఉన్నా ఫోన్‌లో మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు.
Also Read: నేటి నుంచే తుంగభద్ర పుష్కరాలు.. క్షేత్రాలు, ఏర్పాట్లు ఇవీ!
గ్రేటర్‌లోనూ బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయాలని అనుకున్నట్లు సమాచారం. కనీసం పదో ఇరవయ్యో డివిజన్లలో పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. కానీ బీజేపీ మాత్రం జనసేన గాలి తీయడానికే ప్రయత్నాలు చేసినట్లుగా కనిపించింది. సంజయ్.. పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలవాలనుకున్నప్పుడు అది పొత్తు కోసమేనని జనసేన అనుకున్నప్పటికీ.. చివరకు అది కాదంటూ బీజేపీ ఎత్తేసింది. అంటే.. జనసేన మిత్రుడి వరకే కానీ పొత్తుకు పనికిరాదన్నది బీజేపీ ఉద్దేశంలా కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్