
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 అంచనాలను భిన్నంగా సాగుతోంది. అంతోఇంతో పరిచయం ఉన్న కంటెస్టెంట్లే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ ఉండటం గమనార్హం. గత సీజన్లలా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి సక్సెస్ కాలేకపోతున్నారు. బిగ్ బాస్ టీఆర్పీ రేటింగులు కూడా అంత ఘనంగా లేవు. ఇప్పటికే ఈ షో నుంచి ఒక మేల్ కంటెస్టెంట్, ఐదుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.
ఊహించని విధంగా శనివారం రోజున ఆరోగ్యం బాగోలేదనే కారణంతో గంగవ్వ ఎలిమినేట్ అయింది. అయితే తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయల్ తనను కూడా గంగవ్వలా ఎలిమినేట్ చేయమని కోరుతూ ఉండటం గమనార్హం. చాలామంది అభిమానులు రియల్ లైఫ్ నోయల్ కు, బిగ్ బాస్ హౌస్ నోయల్ కు చాలా తేడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. దివి కూడా నామినేషన్ సమయంలో నిజమైన నోయల్ కనిపించడం లేదంటూ కామెంట్లు చేసింది.
బిగ్ బాస్ అన్ సీన్ వీడియో నోయల్ నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నామినేషన్ పిచ్చ లైట్ అని.. మెడికల్ రూమ్ లో గంగవ్వను పంపించినట్లు తనను కూడా పంపించాలని కోరానని నోయల్ అభిజిత్ తో చెప్పారు. నేరుగా బయటకు వెళ్లినా నామినేషన్ ప్రక్రియ ద్వారా వెళ్లినా ఒకటేనని అన్నారు. అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేసినందుకు ఆయనకు తాను టార్గెట్ అయ్యానని మాస్టర్ అలా ఆలోచించడం సరికాదని చెప్పారు.
తనను దివి నామినేట్ చేయడానికి కారణాలు తనకు తెలుసని అభిజిత్ తో అన్నారు. నోయల్ బయటకు వచ్చేస్తానని చేసిన వ్యాఖ్యలు ఆయన అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. గంగవ్వలా బయటకు వస్తానని నోయల్ చెప్పడం ఆయన అభిమానులు అసహనానికి లోనవుతున్నారు.