కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలేదా లేదు. అప్పుడే మనకు మనశ్శాంతి చేకూరే పరిస్థితి కనిపించడం లేదు. దొరికిందే ఛాన్స్ అంటూ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇండియాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 90,632 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 41,13,811కి చేరుకుంది. వరల్డ్ వైడ్ ఒక్కరోజులో ఇన్ని కేసులు ఇప్పటివరకు ఎక్కడా నమోదు కాలేదు. ఈ 24 గంటల్లో 1065 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 70,626కి చేరింది. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
Also Read: కరోనాపై మరో అధ్యయనం.. షాకింగ్ న్యూస్
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వైరస్ ఉధృతి ఆగడం లేదు. టెస్టుల సంఖ్య పెంచిన కొలదీ.. కేసుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఓ వైపు డిశ్చార్జి సంఖ్య పెరుగుతోందనే సంతృప్తి ఉన్నా.. రోజు వస్తున్న కేసుల సంఖ్యను చూస్తే భయం వేస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు ఇప్పటికే 30 వేలు దాటాయి. తాజాగా 32 వేలకు చేరుకున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 10కి కాస్త అటు, ఇటుగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరోనా కేసుల్లో స్వల్పంగా మార్పులు ఉంటున్నాయే తప్ప పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది చనిపోయారు. 2,974 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,40,969కి చేరుకుంది. ఇందులో 1,07,530 మంది డిశ్చార్జి అయ్యారు. మరణించిన వారి సంఖ్య 886కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,553గా నమోదైంది. హోం ఐసోలేషన్‌లో 25,449 మంది ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 325 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌లో -22, భద్రాద్రి కొత్తగూడెంలో-69, జగిత్యాలలో-81, జనగామ-39, జయశంకర్ భూపాలపల్లి-24, జోగుళాంబ గద్వాల-21, కామారెడ్డి-86, కరీంనగర్-144, ఖమ్మం-128, కొమరంభీమ్ -25, మహబూబ్ నగర్-44, మహబూబాబాద్-73, మంచిర్యాల-63, మెదక్-34, మేడ్చల్ మల్కాజ్‌గిరి-185, ములుగు-15, నాగర్ కర్నూలు-51, నల్లగొండ-158, నారాయణపేట్-11, నిర్మల్-19, నిజామాబాద్-95, పెద్దపల్లి-69, రాజన్న సిరిసిల్ల-45, రంగారెడ్డి-197, సంగారెడ్డి-82, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-102, వికారాబాద్-14, వనపర్తి-41, వరంగల్ రూరల్-40, వరంగల్ అర్బన్-117, యాదాద్రి భువనగిరి-67 కేసులు నమోదయ్యాయి.
Also Read: ఎన్-95 మాస్క్ ను మళ్లీ మళ్లీ వాడాలంటే ఇలా చెయ్యండి!
మరోవైపు రాష్ట్రంలో కరోనా టెస్టులు జోరుగా నడుస్తున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 62,736 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 17,30,389కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతీ 10 లక్షలమంది జనాభాకు సగటున 46,608 పరీక్షలను నిర్వహించినట్లు ఆఫీసర్లు తెలిపారు.