https://oktelugu.com/

అఖిలప్రియ భవిష్యత్ ఏం కానుంది?

సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసి అరెస్ట్ అయిన అఖిలప్రియ భవిష్యత్ ఏం కానుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా శుక్రవారం ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను కోర్టు వాయిదా వేసింది. ఆమెను రిలీజ్ చేస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని.. కస్టడీకి అప్పగించాలని పోలీసులు అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం. Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..? ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలప్రియ బెయిల్ దొరకడం అంత ఈజీ కాదన్న వాదన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 11:09 am
    Follow us on

    Bhuma Akhila priya

    సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసి అరెస్ట్ అయిన అఖిలప్రియ భవిష్యత్ ఏం కానుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా శుక్రవారం ఆమె పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను కోర్టు వాయిదా వేసింది. ఆమెను రిలీజ్ చేస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని.. కస్టడీకి అప్పగించాలని పోలీసులు అఫిడవిట్ దాఖలు చేసినట్టు సమాచారం.

    Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు, ప్రాక్టికల్స్ ఎప్పుడంటే..?

    ప్రస్తుత పరిస్థితుల్లో అఖిలప్రియ బెయిల్ దొరకడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె భర్త సహా.. ఈ కిడ్నాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న వారి అనుచరులు పరారీలో ఉన్నారని.. ఇప్పుడు అఖిలప్రియకు బెయిల్ కేటాయిస్తే.. బయటకు వచ్చి మొత్తం సాక్ష్యాలను మార్చేసే అవకాశం ఉందనేది పోలీసుల వాదనగా తెలుస్తోంది.

    అఖిలప్రియకు కర్నూలులో నేరచరిత్ర ఉన్న దృష్ట్యా పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఆమెను ప్రశ్నిస్తే ఈ భూదందాలపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయన్నది ఆసక్తిగా మారింది.

    Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. జగన్ ఒప్పుకుంటారా?

    ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే అఖిలప్రియకు ఇప్పట్లో బెయిల్ సాధ్యం కాదని.. ఆమె విచారణలో ఇంకా విషయాలు వెలుగుచూస్తే మరిన్ని కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆమె మరిన్ని కేసుల్లో ఇరుక్కుపోవడం ఖాయమన్న అంచనాలు నెలకొంటున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్