https://oktelugu.com/

అప్పటి ముచ్చట్లు : నీ మొహంలే.. అప్పుడు చూద్దాంగా !

ఆ రోజుల్లో.. అంటే నలభై నుండి ముప్పై ఏళ్ల క్రితం.. తెలుగులో మాస్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు, పౌరాణికం, అలాగే కామెడీ మూవీస్.. ఇలా అన్ని జోనర్లలో ఏ జోనర్ ను వదిలిపెట్టకుండా సినిమాలు తీసేవాళ్ళు. పైగా అప్పట్లో ఒక్కో జోనర్ కి ఒక్కో స్పెషల్ డైరెక్టర్ ఉండేవాడు. పురాణాలకు కె.వి.రెడ్డి, సోషల్ డ్రామాకి దాసరి నారాయణ రావు, కమర్షియల్ సినిమాకి కె.రాఘవేంద్ర రావు, కామెడీ సినిమాలకు జంధ్యాల ఇలా తమ జోనర్స్ […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 09:52 AM IST
    Follow us on


    ఆ రోజుల్లో.. అంటే నలభై నుండి ముప్పై ఏళ్ల క్రితం.. తెలుగులో మాస్ సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథా చిత్రాలు, పౌరాణికం, అలాగే కామెడీ మూవీస్.. ఇలా అన్ని జోనర్లలో ఏ జోనర్ ను వదిలిపెట్టకుండా సినిమాలు తీసేవాళ్ళు. పైగా అప్పట్లో ఒక్కో జోనర్ కి ఒక్కో స్పెషల్ డైరెక్టర్ ఉండేవాడు. పురాణాలకు కె.వి.రెడ్డి, సోషల్ డ్రామాకి దాసరి నారాయణ రావు, కమర్షియల్ సినిమాకి కె.రాఘవేంద్ర రావు, కామెడీ సినిమాలకు జంధ్యాల ఇలా తమ జోనర్స్ లో వారు ఇరగదీసి ఇంకెవరికీ అవకాశం లేకుండా చేసేశారు. కానీ అప్పుడే.. డైరెక్టర్ అయిన ఓ కుర్రాడితో అప్పటి నిర్మాతల్లోనే మేరు పర్వతం లాంటి వ్యక్తి.. నీది ఏ జోనర్ అయ్యా అన్నాడట.

    Also Read: ప్రభాస్ తో పూజా రొమాంటిక్ గ్లింప్స్ !

    ఆ మాటకు ఆ కుర్ర డైరెక్టర్.. నేను అన్ని జోనర్స్ లో సినిమాలు చేస్తాను.. నాకు అన్ని జోనర్స్ మీద పట్టు ఉంది అన్నాడట. ఈ సమాధానం ఆ పెద్దాయనకు పెద్ద జోక్ లా అనిపించింది. నీ మొహంలే.. వెళ్లి ముందు ఒక్క జోనర్ లోనైనా ఒక హిట్ కొట్టు. అప్పుడు చూద్దాంగా.. నీ రేంజ్ అంటూ ఆ పెద్దాయన హేళనగా మాట్లాడాడట. అది మనసులో పెట్టుకున్న ఆ కుర్ర డైరెక్టర్ ఆ తరువాత కాలంలో అన్ని జోనర్స్ లో సినిమాలు తీసి.. ప్రతి జోనర్ లో సూపర్ హిట్స్ కొట్టాడు. అతనే ‘కోడి రామకృష్ణ’. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ ‘అంకుశం’ వంటి సినిమాలను తీసిన కోడి రామకృష్ణ.. ఆ తరువాత వాటిని మించిన సినిమాలు తీశాడు.

    Also Read: ఎక్స్ క్లూజివ్ : రవితేజ క్రాక్ రిలీజ్ కి బ్రేక్ !

    మ్ముఖ్యంగా తన ప్రత్యేకతను చూపిస్తూ ‘అమ్మోరు’ అనే సినిమా తీసాడు. ఈ సినిమాలో స్టార్ హీరో లేడు, ఆకర్షించే పాటలు లేవు, ప్రేమ కథ లేదు, పైగా ఎలాంటి కమర్షియల్ ఎంటెర్టైమెంట్ ఎలిమెంట్స్ కూడా ఏవి లేవు. అయినప్పటికీ ‘అమ్మోరు’ చిత్రం స్టార్ హీరోల సినిమాలను మించి బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే.. అది కేవలం కోడి రామకృష్ణ గొప్పతనమే. అసలు గ్లాఫిక్స్ పెద్దగా ప్రాచుర్యం పొందని రోజుల్లో కూడా ఓ విజువల్ వండర్ ను అందించడం అంటే.. కోడి రామకృష్ణకు మాత్రమే సాధ్యం అయింది అది. ఇప్పటి శంకర్, రాజమౌళిలకు ప్రేరణ కోడి రామకృష్ణ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్