https://oktelugu.com/

చైతు కోసం పోటీలో పూజా – రష్మిక !

వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” మూవీలో హీరోయిన్ గా ఎవర్నీ తీసుకోవాలా అని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను లేదా రష్మికను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందని.. పైగా హీరో అలా ఉండటానికి హీరోయిన్ పాత్రనే కీలకం అని.. అందుకే స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 10:11 AM IST
    Follow us on


    వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” మూవీలో హీరోయిన్ గా ఎవర్నీ తీసుకోవాలా అని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ క్రమంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను లేదా రష్మికను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందని.. పైగా హీరో అలా ఉండటానికి హీరోయిన్ పాత్రనే కీలకం అని.. అందుకే స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని దర్శకనిర్మాతల ఆలోచన. అందుకే మొదట విక్రమ్ కుమార్ సమంత అయితే బాగుంటుందనుకున్నాడు.

    Also Read: అప్పటి ముచ్చట్లు : నీ మొహంలే.. అప్పుడు చూద్దాంగా !

    ఎలాగూ తానూ ఇప్పటికే సమంతతో రెండు సినిమాలు చేయడం, ఆ రెండు సినిమాలు విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందనేది విక్రమ్ నమ్మకం. అయితే, చైతు సమంతా కాంబినేషన్లో వచ్చే సినిమాల పై భారీ అంచనాలు ఉంటాయని.. లాస్ట్ సినిమా మజిలీ కూడా సూపర్ హిట్ అయిందని.. కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి, అందుకే సమంత హీరోయిన్ గా వద్దు అనేది దిల్ రాజు అభిప్రాయం. సినిమాలో కూడా నటించారు. ప్రేక్షకులకి మోనాటిని వస్తుందేమో అంటూ చైతు కూడా సమంతని వద్దన్నాడట. అందుకే ఫైనల్ గా పూజా లేదా రష్మిక ఇద్దరిలో ఒకర్ని ఫైనల్ చేయనున్నారు.

    Also Read: ప్రభాస్ తో పూజా రొమాంటిక్ గ్లింప్స్ !

    మరి ఏ ముద్దుగుమ్మ ఈ అవకాశం అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విక్రమ్ కుమార్ ఎప్పుడూ రొటీన్ కి భిన్నమైన కధాంశాలతోనే ప్రేక్షకులని అలరిస్తాడు కాబట్టి, ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన కథను రాసుకున్నాడట. ఓ మధ్యతరగతి అబ్బాయి ఒక తెలుగు అగ్ర కథానాయకుడికి పెద్ద అభిమాని, ఆ హీరో కోసం కటౌట్స్ కట్టే స్థాయి నుండి ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాలని నిర్ణయించుకున్నాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అనుభవాలు పొందాడు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్ అట. మరి చూడాలి సినిమా ఎలా ఉండబోతుందో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్