రైతు కోసమే భారత్ బంద్.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లోలో 11రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. పంజాబ్ రైతులతో మొదలైన ఈ ఉద్యమం హర్యానా.. యూపీతోపాటు దక్షిణాది రైతుల వరకు పాకింది. తాజాగా రైతులు చేపడుతున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా భారీగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 8న రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. రైతులకు మద్దతుగా పలు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. […]

Written By: Neelambaram, Updated On : December 7, 2020 12:52 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లోలో 11రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. పంజాబ్ రైతులతో మొదలైన ఈ ఉద్యమం హర్యానా.. యూపీతోపాటు దక్షిణాది రైతుల వరకు పాకింది. తాజాగా రైతులు చేపడుతున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా భారీగా మద్దతు లభిస్తోంది.

ఈ క్రమంలోనే డిసెంబర్ 8న రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. రైతులకు మద్దతుగా పలు రాజకీయ, సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్.. టీఆర్ఎస్, టీడీపీ, శివసేన, శిరోమణి అకాళీదల్, ఎన్సీపీ, డీఎంకేం, తృణమూల్ కాంగ్రె్ తదితర పార్టీలు రైతులకు బహిరంగంగా మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపాయి.

రైతుల ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలోనే కేంద్రం పలుమార్లు రైతులతో చర్చించింది. అయినప్పటికీ ఫలితం రాలేదు. రైతులతో కేంద్రం మరోసారి చర్చలకు సిద్ధం అవుతుండగానే రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్రంతో రైతుల చర్చలు సఫలం కాకుండా భారత్ బంద్ యథావిధిగా కొనసాగుతుందని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

ఉత్తరాది రైతులతో మొదలైన ఉద్యమానికి ప్రస్తుతం దక్షిణాది రైతులు కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా ఉద్యమం మారింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్లకు మేలు చేసేవీగా ఉన్నాయని వాటిని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం మాత్రం రైతులకు మేలు చేసే చట్టాలను చెబుతండటంతో ఇరువురి మధ్య ప్రతిష్టంభన నెలకొంటుంది.

ఢిల్లీలోని తీవ్రమైన చలిలోనూ రైతులు దీక్షలు చేస్తుండటంతో చలిపోయిన పలువురు ప్రముఖులు వారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ప్రముఖ నటుడు, సింగర్ దిల్జిజ్ దోసంజ్ కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. భారత బాక్సర్ విజేందర్ సింగ్ ప్రభుత్వం రైతుల సమస్యను పరిష్కరించకుంటే తనకు కేంద్రం ఇచ్చిన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని హెచ్చరించారు.

రైతు ఉద్యమం తీవ్రతరం కావడంతో కేంద్రం బిల్లులో సవరణ చేసేందుకు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు జరుగుతుండటంతో చర్చలు ఫలిస్తాయా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.