
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 35 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. రైతులకు తక్షణ సాయం కింద 10వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే సాయం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో రైతాంగానికి అండగా పవన్ దీక్ష చేపట్టారు. గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించిన విషయం తెలిసిందే.