
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ట్రీట్ మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చు.
కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ స్కీమ్ ముఖ్య లక్ష్యం కాగా పేద ప్రజలు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు పొందడానికి అర్హులు. ఒక్కో కుటుంబం కేంద్రం అమలు చేస్తున్న జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఏకంగా 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రైకి వెళ్లి సీఎంవోను కలిసి ఉచితంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. లేదా ఆరోగ్య మిత్రను సంప్రదించి ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేద ప్రజలకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ స్కీమ్ లో చేరడం ద్వారా మేలు జరుగుతుంది.
ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో చేర్కపోతే ఈ ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు.