మరి, రేపు రిలీజ్ కానున్న ఆ 6 సినిమాల పరిస్థితి ఏమిటో చూద్దాం. ముందుగా అంచనాలు ఉన్న సినిమా ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’. ఈ సినిమాని ఆహా మూడు కోట్లుకు కొనుక్కోవడం తో మొదలైన ఈ సినిమా హడావిడి మొత్తానికి జనంలో క్రేజ్ ను తెచ్చుకోగలిగింది. యూత్ లో ఈ సినిమా పై ఆసక్తి ఉంది. కాబట్టి బి.సి సెంటర్స్ లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం పక్కా.
‘రాజా వారు రాణి వారు’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం రెండో సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకోవడం కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇక కిరణ్ సరసన ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయికుమార్ కామెడీ అండ్ ఎమోషనల్ పాత్రలో నటించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. శ్రీధర్ గాదె దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి థియేటర్లలో మంచి కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి.
అలాగే రేపు రిలీజ్ కానున్న ఇతర సినిమాల విషయానికి వస్తే “ఇప్పుడు కాక ఇంకెప్పుడు”, “మ్యాడ్”, “ముగ్గురు మొనగాళ్లు”, “మెరిసే మెరిసే”, “క్షీరసాగర మధనం”. లిస్ట్ భారీగా ఉన్నా.. ఈ సినిమాల పై ఎలాంటి అంచనాలు లేవు. ఉన్న వాటిల్లో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాకి కనీస ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సేఫ్ అవ్వడం కష్టమే.
మరో సినిమా ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’. ఈ సినిమా కోసం జనం థియేటర్స్ కి వెళ్లే ఊపు లేదు. మరో సినిమా ‘మెరిసే మెరిసే. ఈ సినిమా ప్రమోషన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో కంటెంట్ లేదు. కాబట్టి థియేటర్స్ లో ఈ ‘మెరిసే’ సినిమా మెరవడం దాదాపు అసాధ్యమే. ఇక ‘క్షీర సాగర మథనం’. పేరే చెబుతుంది, ఈ సినిమా ఎలా ఉండబోతుందో. అసలు ఈ సినిమా ఉన్నట్టే జనానికి తెలియదు. కాబట్టి, దీని గురించి అదనపు మాటలు అనవసరం.
ఇక చివరగా “మ్యాడ్”. సినిమాలో పరిధి దాటిన బూతు బాగోతాలు ఎక్కువ ఉన్నాయని టాక్. కాబట్టి, థియేటర్స్ లో సినిమా వర్కౌట్ అవ్వకపోయినా.. ఓటీటీలో క్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే.. ఇప్పటివరకు ఈ సినిమాని ఏ ఓటీటీ సంస్థ తీసుకోలేదు. మొత్తమ్మీద ఈ 6 చిత్రాలలో ఓపెనింగ్స్ వచ్చేది ఒక్క ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’కే. మిగతా సినిమాలకు నష్టాలే.