ఆత్మగౌరవాన్ని నిలుపుకునే సినిమాలేవి?

అరువు సంస్కృతిని మోస్తూ బ్రతికేవాళ్లం మనం. మన వంశంలో ఎవరూ భరతనాట్యం ఆడరు.. మన కులంలో ఎవ్వరికీ ఏరాగమూ రాదు, మనలో ఎవ్వరికీ సంస్కృతం మాట్లాడడం రాదు, మన దేవతలు ఎన్నడూ గుడిలో కనిపించరు.. మన అమ్మ ఎన్నడూ భరతమాతలాగా నిండు నగలేసుకుని కనిపించదు.. కానీ ఇదంతా మనమీద రుద్ది దీన్ని భారతీయ సంస్కృతి, నాగరికత అని ముద్రవేసి మనల్ని అనుసరించమంటే అనుసరిస్తున్నాం. మన సినిమాలు మనవి కావు, చివరికి ఇళ్లలోని టీవీల సీరియల్లోని జీవిత విధానాలు […]

Written By: NARESH, Updated On : March 7, 2021 11:49 am
Follow us on

అరువు సంస్కృతిని మోస్తూ బ్రతికేవాళ్లం మనం. మన వంశంలో ఎవరూ భరతనాట్యం ఆడరు.. మన కులంలో ఎవ్వరికీ ఏరాగమూ రాదు, మనలో ఎవ్వరికీ సంస్కృతం మాట్లాడడం రాదు, మన దేవతలు ఎన్నడూ గుడిలో కనిపించరు.. మన అమ్మ ఎన్నడూ భరతమాతలాగా నిండు నగలేసుకుని కనిపించదు..

కానీ ఇదంతా మనమీద రుద్ది దీన్ని భారతీయ సంస్కృతి, నాగరికత అని ముద్రవేసి మనల్ని అనుసరించమంటే అనుసరిస్తున్నాం. మన సినిమాలు మనవి కావు, చివరికి ఇళ్లలోని టీవీల సీరియల్లోని జీవిత విధానాలు కూడా మనవి కావు. చివరాఖరికి మూడున్నర శతాబ్దాలు తెల్లవారి బానిసత్వాన్ని, దోపిడీనీ అనుభవించిన మనం ఒక్కటి కనీసం ఒక్క సినిమానైనా విముక్తిమీద నిర్మించుకోగలిగామా?

హాలీవుడ్ దాకా ఎందుకు? పక్కన హాంకాంగ్ తీసే చైనీస్ సినిమాలు చూస్తే ఎప్పుడూ చిత్రమనిపిస్తుంది. ఇటీవల మూవీస్ చానెల్ లో ‘ఇప్ మ్యాన్’( IP MAN) సినిమా చూస్తున్నప్పుడే కాదు ఎప్పుడు చైనీస్ సినిమాలు చూసినా కనిపిస్తుంది. వాళ్ల మార్షల్ ఆర్ట్స్ ఫుట్‌బాల్ ఆటలోనూ రంగరించి షావోలిన్ సార్ (SHAOLIN SOCCER) అనే అలరించే సినిమా తీయగలరు.

ఇప్ మ్యాన్.. బ్రూస్లీ గురువు మీద సినిమాగా తీసినా, రెండో ప్రపంచ యుద్ద కాలంలో పొరుగున వున్న జపాన్ దేశం.. చైనాని ఆక్రమించుకుని చేసిన దారుణాలు, దాష్టీకాలూ, అవమానాల మీద ఒక మార్షల్ ఆర్ట్స్ గురువు చేసిన ఒంటరి యుద్దం ‘ఇప్ మ్యాన్’ సినిమాలుగా మలిచి అద్భుతంగా చిత్రీకరించారు.

హీరో డానీ యెన్ ఒక మనిషిగా గాక, పరాజిత దేశపు ప్రతినిధిగా కనిపిస్తాడు. కనిపించే పేదరికం, అవమానం, లోపల రగిలే ఆర్తి, పెదవి విప్పలేని ధిక్కారం.. గొప్పగా చూపిస్తాడు. బహుశా, ఇందుకోసమే కాబోలు, ఈ సీరీస్ 4 సినిమాలకు కొనసాగింది. మీరూ చూడండి, బానిసత్వాన్ని రుద్దే బాహుబలి గాకుండా ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ఇలాంటి సినిమాల్ని.