https://oktelugu.com/

అచ్చెన్న చేతికే ఏపీ టీడీపీ పగ్గాలు, టీటీడీపీ ఎల్ రమణకే..

ఊగిసలాటకు తెరపడింది. అచ్చెన్నకు పదవి ఇవ్వరన్న ప్రచారం ఒట్టిదేనని తేలింది. ఏపీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణ రెండోసారి కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు. Also Read: సర్కార్ వైఫల్యమైనా ఈగవాలనీయని మీడియా? మొత్తం 27మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 01:31 PM IST
    Follow us on

    ఊగిసలాటకు తెరపడింది. అచ్చెన్నకు పదవి ఇవ్వరన్న ప్రచారం ఒట్టిదేనని తేలింది. ఏపీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని నియమిస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణ రెండోసారి కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు.

    Also Read: సర్కార్ వైఫల్యమైనా ఈగవాలనీయని మీడియా?

    మొత్తం 27మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. మరో 25 మందితో టీడీపీ పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.

    Also Read: ఆర్టీసీల పంతాలు.. ప్రైవేట్ బస్సుల దందాలు.. ప్రయాణికులకు కష్టాలు

    పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు. జాతీయ పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా సభ్యులుగా ఉన్నారు.