Site icon OkTelugu

మల్కన్ గిరి కలెక్టర్ పై హత్యకేసు నమోదు

సాక్ష్యాలు లేకుండా చేసిన ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి కలెక్టర్ పై హత్యకేసు నమోదైంది. మల్కన్ గిరి కలెక్టర్ మనీశ్ అగర్వాల్ వద్ద వ్యక్తిగత పేఏ గా దేబ్ నారాయణ్ పండా గతంలో పనిచేశారు. అయితే గత సంవత్సరం డిసెంబర్ లో నారాయణ్ కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   అదే నెల 28న మల్కన్ గిరి పట్టణసమీపంలో నారాయణ్ మృత దేహం లభించింది. ముందుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని భావించినా.. ఆ తరువాత తన భర్త మృతికి కలెక్టర్, మరి కొందరు కారణమని నారాయణ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించడంతో రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి కలెక్టర్ పై హత్యకేసు నమోదు చేశారు.

Exit mobile version